Congress Document : జోడో యాత్ర ఆధారంగా డాక్యుమెంట్
ప్రకటించిన ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా
Congress Document : భారత్ జోడో యాత్రను అనుసరించి విజన్ డాక్యుమెంట్ 2024 సిద్దం చేయాలని సూచించారు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ. ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో 85వ ప్లీనరీ సమావేశంలో కీలక సూచనలు చేశారు.
ఆరు తీర్మానాలపై చర్చించింది సమావేశం. ఈ సందర్భంగా పార్టీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ ప్రస్తుత తిరోగమన మార్గాన్ని తిప్పి కొట్టాలి. వృద్ది మంత్రం మానవ స్పర్శను కలిగి ఉండాలి. జీవనోపాధి అవకాశాలను సృష్టించాలని పార్టీ నిర్ణయించింది.
కాంగ్రెస్ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ 3,768 కిలోమీటర్ల మేర భారత్ జోడో యాత్రను చేపట్టారు. 150 రోజులకు పైగా సాగింది. కన్యాకుమారి నుంచి మొదలై కాశ్మీర్ లో ముగిసింది. ఈ మేరకు ఆయా ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యల గురించి విన్నవించారు. పెద్ద ఎత్తున జనం నుంచి ఆదరణ లభించింది రాహుల్ గాంధీకి. ఇందులో భాగంగానే భారత్ జోడో యాత్రను అనుసరించి కాంగ్రెస్ పార్టీ విజన్ డాక్యుమెంట్(Congress Document) 2024 ని సిద్దం చేయనుంది.
ఇదిలా ఉండగా పార్టీమాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఫిబ్రవరి 26న ప్లీనరీలో ప్రసంగించనున్నారు. డాక్యుమెంట్ లో నిరుద్యోగం, పేదరిక నిర్మూలన, ద్రవ్యోల్బణం, మహిళా సాదికారత, ఉద్యోగాల కల్పన , జాతీయ భద్రత వంటి సమస్యలతో కూడిన డాక్యుమెంట్ 2025ను సిద్దం చేస్తుంది.
న్యాయ వ్యవస్థపై న్యాయ శాఖ మంత్రి దాడికి దిగుతున్నారని , న్యాయ వ్యవస్థ స్వతంత్రత , సమగ్రతను కాపాడతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. నా ఇన్నింగ్స్ భారత్ జోడో యాత్రతో ముగుస్తుందని , ఇది పార్టీకి ఒక మలుపు అని పేర్కొన్నారు.
Also Read : ఆత్మహత్యలపై సీజేఐ ఆందోళన