Shehbaz Sharif : భార‌త్ తో స్నేహానికి సిద్ధం – షెహ‌బాజ్

కానీ కాశ్మీర్ స‌మ‌స్య ప్ర‌ధాన అడ్డంకి

Shehbaz Sharif : పాకిస్తాన్ దేశ ప్ర‌ధాన మంత్రి షెహ‌బాజ్ ష‌రీఫ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాము భార‌త్ తో శాంతి సంబంధాల‌ను కొన‌సాగించేందుకు సిద్ధంగా ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశాడు.

కానీ కాశ్మీర్ స‌మ‌స్య ప్ర‌ధానంగా అవ‌రోధంగా ఉంద‌న్నారు. ప్ర‌స్తుతం శ్రీ‌లంకలో చోటు చేసుకుంటున్న సంక్షోభం పాకిస్తాన్ లో కూడా నెల‌కొంది. రెండు మూడు నెల‌ల వ‌ర‌కు మాత్ర‌మే విదేశీ మార‌క నిల్వ‌లు ఉండ‌డం ప్ర‌ధాన కార‌ణంగా ఉంది.

ప్ర‌ధాని ష‌రీఫ్ ఐక్య రాజ్య స‌మితి తీర్మానాల‌కు లోబ‌డి కాశ్మీర్ స‌మ‌స్య ప‌రిష్కారంతోనే ఈ ప్రాంతంలో సుస్థిర శాంతి నెల‌కొంటుంద‌న్నారు.

యుద్దం వ‌ల్ల అశాంతి మాత్ర‌మే మిగులుతుంద‌ని, శాంతికి పూర్తి విఘాతంగా ఉంటుంద‌ని స్పష్టం చేశారు. భార‌త్ తో తాము ఇప్ప‌టికీ చ‌ర్చ‌ల ద్వారా శాశ్వ‌త ప‌రిష్కారం ఇరు దేశాల‌కు మంచిద‌ని తాము న‌మ్ముతున్నామ‌న్నారు షెహ‌బాజ్ ష‌రీఫ్‌(Shehbaz Sharif).

ఇండియా స్పందించ‌క పోయినా తాము మాత్రం చ‌ర్చ‌లు జ‌రిపేందుకు సిద్దంగా ఉన్నామ‌ని ఆరోపించారు పీఎం. ఇదిలా ఉండ‌గా హార్వ‌ర్డ్ యూనివ‌ర్శిటీ నుంచి వ‌చ్చిన విద్యార్థుల టీంతో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఈ విష‌యాన్ని అంత‌ర్జాతీయ ప‌త్రిక ది న్యూస్ ఇంట‌ర్నేష‌న‌ల్ వెల్ల‌డించింది. పాకిస్తాన్ ఎప్పుడూ దురాక్ర‌మ‌ణ‌కు పాల్ప‌డ‌ద‌న్నారు. వాణిజ్యం, ఆర్థిక రంగాల‌లో ఇరు దేశాల మ‌ధ్య పోటీ అవ‌స‌ర‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు పాకిస్తాన్ ప్ర‌ధాన‌మంత్రి షెహ‌బాజ్ ష‌రీఫ్‌.

పాకిస్తాన్ ఏర్పాటైన స‌మ‌యంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ది చెందింద‌న్నారు. కానీ చోటు చేసుకున్న రాజ‌కీయ సంక్షోభం కార‌ణంగా ఆర్థిక లేమితో ఇబ్బంది ప‌డుతోంద‌న్నారు షెహ‌బాజ్ ష‌రీఫ్‌.

Also Read : తాలిబ‌న్ల అదుపులో ఫిల్మ్ మేక‌ర్..జ‌ర్న‌లిస్ట్

Leave A Reply

Your Email Id will not be published!