President Draupadi Murmu : 26న తెలంగాణకు రాష్ట్రపతి రాక
ఐదు రోజుల పర్యటించనున్న ముర్ము
President Draupadi Murmu : భారత రాష్ట్రపతిగా కొలువు తీరిన ద్రౌపది ముర్ము ఇటీవలే ఏపీలో పర్యటించారు. ఆమె రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. తాజాగా మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆమె పర్యటనను ఖరారు చేసింది రాష్ట్రపతి కార్యాలయం.
ఇదే విషయాన్ని రాష్ట్ర సర్కార్ కు తెలియ చేసింది. ముందస్తు ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం నిమగ్నమైంది. తెలంగాణలో ద్రౌపది ముర్ము ఐదు రోజుల పాటు పర్యటించనున్నారు. టూర్ లో భాగంగా 26న నేరుగా శ్రీశైలంకు వెళతారు. అక్కడ దైవ దర్శనం చేసుకుని నేరుగా హైదరాబాద్ కు మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారు.
బొల్లారంలో యుద్ద స్మారకానికి నివాళులు అర్పిస్తారు. వీర నారీమణులను సత్కరిస్తారు రాష్ట్రపతి. ఆరోజు రాత్రి 7.45 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఇచ్చే విందుకు హాజరవుతారు. 27న నారాయణగూడ కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థల విద్యార్థులతో సంభాషిస్తారు.
అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడెమీలో జరిగే మీటింగ్ కు హాజరవుతారు రాష్ట్రపతి. 28న భద్రాచలం సీతారామ స్వామి ఆలయాన్ని, ములుగు జిల్లా రామప్ప రుద్రేశర గుడిని సందర్శిస్తారు. ప్రసాద్ పథకాన్ని ప్రారంభిస్తారు ద్రౌపది ముర్ము(President Draupadi Murmu). 29న జి . నారాయణమ్మ ఐటీ కాలేజీని సందర్శిస్తారు.
సాయంత్రం శంషాబాద్ లోని రామానుజ విగ్రహాన్ని సందర్శిస్తారు. 30న రంగారెడ్డి జిల్లా కన్హ శాంతి వనంలో శ్రీరామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగిస్తారు. అనంతరం ఢిల్లీ వెళతారు.
Also Read : స్వామి మహరాజ్ సేవలు ప్రశంసనీయం