President Murmu : దేశాభివృద్దిలో కీల‌కం కావాలి

అవార్డులు అంద‌జేసిన ద్రౌప‌ది ముర్ము

President Murmu : న్యూఢిల్లీ – దేశాభివృద్దిలో ప్ర‌తి ఒక్క‌రు భాగం అయిన‌ప్పుడే మ‌రింత ముందుకు వెళ్ల‌గ‌ల‌మ‌ని పేర్కొన్నారు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము(President Murmu). జాతీయ ఇంధ‌న ప‌రిర‌క్ష‌ణ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఇంధ‌న ప‌రిర‌క్ష‌ణ పుర‌స్కారాలు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

President Murmu Comment

ఏడు జాతీయ ఇంధ‌న ప‌రిర‌క్ష‌ణ అవార్డుల‌ను అందుకున్న ద‌క్షిణ మ‌ధ్య రైల్వేను ప్ర‌త్యేకంగా అభినందించారు. ఏడు విభాగాల‌లో అత్యుత్త‌మ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌ర్చ‌డం బాగుంద‌న్నారు ప్రెసిడెంట్. ఇదిలా ఉండ‌గా ప్ర‌భుత్వ కార్యాల‌యాల వ‌ర్గంలో హైద‌రాబాద్ ప్యాసింజ‌ర్ రిజ‌ర్వేష‌న్ సిస్ట‌మ్ (పీఆర్ఎస్) భ‌వ‌నం ప్ర‌థ‌మ బ‌హుమ‌తి పొందింది. రైల్వే వ‌ర్క్ షాప్ విభాగంలో విజ‌య‌వాడ లోని వ్యాగ‌న్ డిపో టాప్ లో నిలిచింది.

ఇక జోన‌ల్ రైల్వేల విభాగంలో ద‌క్షిణ మ‌ధ్య రైల్వే జోన్ కు రెండవ బ‌హుమ‌తి ల‌భించింది. లేఖ భ‌వ‌న్ కు పుర‌స్కారం ల‌భించింది. రేణిగుంట రన్నింగ్ రూమ్ మెరిట్ స‌ర్టిఫికెట్ పొందింద‌న్నారు. గుంత‌క‌ల్ ర‌న్నింగ్ రూమ్ కూడా అవార్డు అందుకుంది. డివిజ‌నల్ రైల్వే మేనేజ‌ర్ ఆఫీస్ కూడా అవార్డు పొంద‌డం విశేషం.

ద‌క్షిణ మ‌ధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ , విజ‌య‌వాడ డివిజ‌న్ కు చెందిన డీఆర్ఎస్ న‌రేంద్ర ఎ పాటిల్ , వ్యాగ‌న్ డిపోకు గాను తొలి బ‌హుమ‌తి అందుకున్నారు. ఎస్సీఆర్ ప్రిన్సిప‌ల్ చీఫ్ ఏఈ పీడీ మిశ్రాతో పాటు , సికింద్రాబాద్ డివిజ‌న్ డీఆర్ఎం భ‌ర‌తేష్ కుమార్ జైన్ తొలి బ‌హుమ‌తిని పొందారు.

Also Read : Jogu Ramanna : వైద్య విద్యార్థులపై దాడులేలా

Leave A Reply

Your Email Id will not be published!