Jogu Ramanna : వైద్య విద్యార్థులపై దాడులేలా

మాజీ మంత్రి జోగు రామ‌న్న

Jogu Ramanna : ఆదిలాబాద్ – మాజీ మంత్రి జోగు రామ‌న్న తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వైద్య విద్యార్థుల‌పై అకార‌ణంగా దాడులు చేయ‌డం దారుణ‌మ‌న్నారు. వారికి తాము సంపూర్ణ మ‌ద్ద‌తు తెలియ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. విద్యార్థుల‌పై జ‌రిగిన ఘ‌ట‌న‌పై క‌మిటీ వేసి విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. వైద్య విద్య‌లో దూసుకు పోతున్న ఆదిలాబాద్ ను భ‌య భ్రాంతుల మ‌ధ్య విధులు నిర్వ‌హించేలా దుస్థితిని క‌ల్పించ వ‌ద్ద‌ని కోరారు జోగు రామ‌న్న‌.

Jogu Ramanna Comment

రిమ్స్ మెడిక‌ల్ కాలేజీలో జ‌రిగిన అమానుష ఘ‌ట‌న‌పై తీవ్రంగా స్పందించారు. మెడిక‌ల్ విద్యార్థుల‌కు అండ‌గా ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. క‌లెక్ట‌ర్ ద్వారా క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని, విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు.

మెడిక‌ల్ కాలేజీలోకి వాహ‌నం ద్వారా చొర బ‌డ‌టం , అమానుషంగా ప్ర‌వ‌ర్తించ‌డం త‌న‌ను విస్తు పోయేలా చేసింద‌న్నారు జోగు రామ‌న్న‌(Jogu Ramanna). గ‌త నెల రోజుల కింద‌ట కొంత‌మంది చొర‌బ‌డి దాడుల‌కు పాల్ప‌డ్డారంటూ మెడిక‌ల్ విద్యార్థులు ఆయ‌న‌తో మొర పెట్టుకున్నారు.

దీనిని బ‌హిష్క‌రిస్తూ జిల్లా క‌లెక్ట‌ర్ ఆఫీసు ముందు విద్యార్థులు ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా జోగు రామ‌న్న భ‌రోసా ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఎవ‌రూ కూడా ఆందోళ‌న ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఇదిలా ఉండ‌గా రాష్ట్ర ప్ర‌భుత్వం ఘ‌ట‌న‌పై ఆరా తీసింది. చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేసింది.

Also Read : AP 10th Inter Exam : ఏపీలో 10, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్

Leave A Reply

Your Email Id will not be published!