Alvin Bragg Trump : దేశాధ్యక్షుడైనా సామాన్యుడైనా ఒక్కటే
మాన్హాటన్ జిల్లా అటార్నీ ఆల్విన్ బ్రాగ్
Alvin Bragg Trump : దేశానికి అధ్యక్షుడైనా లేదా మాజీ అధ్యక్షుడైనా లేదా సామాన్యులు ఎవరైనా చట్టం ముందు ఒక్కటేనని గుర్తుంచు కోవాలని స్పష్టం చేశారు అమెరికాలోని మాన్హాటన్ జిల్లా అటార్నీ ఆల్విన్ బ్రాగ్(Alvin Bragg Trump). అమెరికా మాజీ చీఫ్ డొనాల్డ్ ట్రంప్ హుష్ మనీ అక్రమ చెల్లింపుతో పాటు 34 నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. మంగళవారం మాజీ అధ్యక్షుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
న్యూయార్క్ కోర్టులో ఆయనను హాజరు పరిచారు. ఈ సందర్భంగా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఏ పాపం తెలియదని , తాను నిర్దోషినని, తాను అమాయకుడినని, కావాలని రాజకీయంగా తనను ఇరికించే ప్రయత్నం చేశారంటూ వాపోయారు. దీనిపై అటార్నీ ఆల్విన్ బ్రాగ్(Alvin Bragg) సీరియస్ గా స్పందించారు.
తీవ్రమైన నేర ప్రవర్తననను సాధారణీకరించడం సాధ్యం కాదన్నారు. మీరు ఎవరైనప్పటికీ చట్టం ముందు అంతా సమానమేనని స్పష్టం చేశారు. దేశానికి మాజీ చీఫ్ అయినంత మాత్రాన చట్టం మీకు ఒక లాగా ఇతరులకు ఒక లాగా అంటూ ఉండదన్నారు.
ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా హుందాగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. మీ వాదనలు వినేందుకు జ్యూరీ సిద్దంగా ఉంది. కానీ మీపై వచ్చిన ఆరోపణలు సరికాదు లేదా తప్పు అని నిరూపించేందుకు మీకు అవకాశం ఉంది. దానిపైనే ఫోకస్ పెట్టాలని తమపై కాదని సీరియస్ గా కామెంట్స్ చేశారు.
Also Read : నేను నిర్దోషిని అమాయకుడిని – ట్రంప్