Kapil Sibal Modi : అవినీతి ప‌రుల్ని ర‌క్షిస్తున్న‌ది ఎవ‌రు

పీఎం మోదీకి ఎంపీ క‌పిల్ సిబ‌ల్ ప్ర‌శ్న

Kapil Sibal Modi : ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అవినీతిపై మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు రాజ్య‌స‌భ ఎంపీ క‌పిల్ సిబ‌ల్(Kapil Sibal Modi). అవినీతి ప‌రుల‌ను రక్షిస్తున్న‌ది ఎవ‌రో ఈ దేశ ప్ర‌జ‌ల‌కు ఎప్పుడో అర్థ‌మై పోయింద‌న్నారు. కోట్లాది రూపాయ‌ల‌కు క‌న్నం పెట్టి , బ్యాంకుల‌ను లూటీ చేసి, వ్యాపారం పేరుతో మోసానికి పాల్ప‌డుతున్న వారికి ఎవ‌రు మ‌ద్ద‌తు ఇస్తున్నారో మోదీకి తెలియ‌దా అని నిల‌దీశారు.

ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను అప్ప‌నంగా క‌ట్ట‌బెడుతూ దేశాన్ని మ‌రింత వెన‌క్కి నెట్టివేస్తున్న‌ది మీరు కాక ఇంకెవ‌రున్నారంటూ మండిప‌డ్డారు క‌పిల్ సిబ‌ల్.

అవినీతి ప‌రుల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో వ‌దిలి పెట్ట బోమంటూ ప్ర‌ధాని చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. యూపీఏ హ‌యాంలోనే అవినీతి ప‌రుల‌కు ఎక్కువ శిక్ష‌లు ప‌డ్డాయ‌ని గుర్తు చేశారు. 2014లో దేశంలో కొలువు తీరిన బీజేపీ ఎన్డీఏ ప్ర‌భుత్వం ఎంత మంది అవినీతి ప‌రుల‌ను ప‌ట్టుకుందో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

క‌పిల్ సిబ‌ల్(Kapil Sibal) గ‌త ఏడాది మేలో కాంగ్రెస్ పార్టీని వీడారు. స‌మాజ్ వాదీ పార్టీ మ‌ద్ద‌తుతో స్వ‌తంత్ర స‌భ్యునిగా రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. అన్యాయానికి వ్య‌తిరేకంగా పోరాడే ల‌క్ష్యంతో ఇటీవ‌ల ఇన్సాఫ్ ను ప్రారంభించారు.

ఎంపీ క‌పిల్ సిబ‌ల్ చేసిన కామెంట్స్ అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. వ్య‌వ‌స్థ‌ల‌ను నాశ‌నం చేసి దేశాన్ని భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్న ఘ‌న‌త మీది కాదా అని మండిప‌డ్డారు .

Also Read : అదానీ మోసం మోదీ మౌనం – రాహుల్

Leave A Reply

Your Email Id will not be published!