Modi : బోయ‌గూడ అగ్నిప్ర‌మాదంపై ప్ర‌ధాని దిగ్భ్రాంతి

బాధిత కుటుంబాల‌కు రూ. 2 ల‌క్ష‌ల ఎక్స్ గ్రేషియా

Modi  : సికింద్రాబాద్ బోయ‌గూడ‌లో చోటు చేసుకున్న అగ్ని ప్ర‌మాదంలో 11 మంది బ‌తుకులు తెల్లారి పోయాయి. ఇవాళ తెల్ల వారుజామున ఘ‌ట‌న చోటు చేసుకుంది.

పొట్ట కూటి కోసం హైద‌రాబాద్ కు వ‌చ్చిన బీహార్ కు చెందిన కార్మికులు చూస్తుండ‌గానే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించింది.

ఇప్ప‌టికే సీఎం కేసీఆర్ ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్ష‌ల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించారు. యుద్ద ప్రాతిప‌దిక‌న మృత దేహాల‌ను వారి స్వంత స్థ‌లాల‌కు త‌ర‌లించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎస్ సోమేష్ కుమార్ (Somesh Kumar) ను ఆదేశించారు.

ఘ‌ట‌న తెలుసుకున్న వెంట‌నే దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(Modi) స్పందించారు. అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న‌పై తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు సంతాపం ప్ర‌క‌టించారు.

ఈ మేర‌కు చ‌ని పోయిన ప్ర‌తి కుటుంబానికి రూ. 2 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్ గ్రేషియా వెల్ల‌డించారు ప్ర‌ధాన మంత్రి మోదీ (Prime Minister Modi) . స్క్రాప్ గోడౌన్ లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

చ‌ని పోయిన వారంతా బీహార్ కు చెందిన వారు. ఘ‌ట‌న తెలుసుకున్న వెంట‌నే 8 అగ్నిమాప‌క శాఖ‌కు చెందిన ఫైర్ ఇంజిన్లు రంగంలోకి దిగాయి. పెద్ద ఎత్తున చోటు చేసుకున్న మంట‌ల్ని అదుపులోకి తీసుకు వ‌చ్చారు.

ఇదిలా ఉండ‌గా షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగానే ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని పోలీసులు భావిస్తున్నారు.

Also Read : అమ‌రుల‌కు వంద‌నం వీరుల‌కు అభివంద‌నం

Leave A Reply

Your Email Id will not be published!