Sitara Mahesh Babu : ప్రిన్స్ త‌న‌య సితార ‘పెన్నీ’ సాంగ్ కేక

డ్యాన్సులో తండ్రిని మించిన కూతురు

Sitara Mahesh Babu : ఎవ‌రీ సితార అనుకుంటున్నారా. టాలీవుడ్ క‌ల‌ల రాకుమారుడు ప్రిన్స్ మ‌హేష్ బాబు , న‌మ్ర‌త‌ల ముద్దుల కూతురు సితార ఘ‌ట్ట‌మ‌నేని.

తాజాగా ఆమె త‌న తండ్రి న‌టిస్తున్న స‌ర్కారు వారి పాట మూవీకి సంబంధించిన పెన్నీ పాట‌కు డ్యాన్సు తో హోరెత్తించింది.

ప్ర‌స్తుతం నెట్టింట్లో షేక్ చేస్తోంది. అచ్చం తండ్రి మ‌హేష్ బాబుకు త‌గ్గ‌ట్టుగా డ్యాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంది. ఈ మూవీకి ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందించారు.

ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించిన మొద‌టి సాంగ్ క‌ళావ‌తి రికార్డుల‌ను తిర‌గ రాస్తోంది. ఆ పాట‌ను సిద్ శ్రీ‌రామ్ , కోర‌స్ తో క‌లిసి పాడారు. అనంత్ శ్రీ‌రామ్ రాశారు.

ఇక రెండో పాట పెన్నీ పేరుతో ప్రోమోను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్. ఈనెల 20న ఆదివారం ఫుల్ సాంగ్ విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ఇదిలా ఉండ‌గా ఈ సాంగ్ లో మ‌హేష్ బాబు మ‌రింత అందంగా క‌నిపిస్తున్నాడు. రాక్ స్టార్ ను మించి పోయేలా లుక్స్ తో కేక పుట్టిస్తుండ‌గా అంతకంటే బాగా లిరిక్స్ , మ్యూజిక్ కు త‌గ్గ‌ట్టు సితార ఘ‌ట్ట‌మ‌నేని (Sitara Mahesh Babu)దుమ్ము రేపింది.

రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇది ఊహించ‌ని స‌న్నివేశం. దీంతో త‌మ క‌ల‌ల రాకుమారుడు ప్రిన్స్ మ‌హేష్ బాబు అంటే పడిచ‌చ్చే అభిమానులు కూతురు సితార చేసిన డ్యాన్స్ కు ఫిదా అవుతున్నారు.

లైక్ ల‌తో , కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు. ఇంకేం మీరూ చూసేయండి సితార‌ను అభినందించండి.

Also Read : ఎఫ్ 3 మూవీ స‌ర్ ప్రైజ్

Leave A Reply

Your Email Id will not be published!