Sarkaru Vaari Paata Song : ల‌వ‌ర్స్ కు ప్రిన్స్ స‌ర్ ప్రైజ్ గిఫ్ట్

స‌ర్కారువారి పాట క‌ళావ‌తి సాంగ్ రిలీజ్

Sarkaru Vaari Paata Song : ఎంతో ఉత్కంఠ‌త‌తో ఎదురు చూస్తున్న ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప్రిన్స్ మ‌హేష్ బాబు న‌టించిన స‌ర్కారు వారి పాట‌కు(Sarkaru Vaari Paata Song)సంబంధించి క‌ళావ‌తి సాంగ్ విడుద‌లైంది.

ఈ మూవీలో ప్రిన్స్ తో పాటు అందాల బొమ్మ కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్నారు. ఎస్ఎస్ థ‌మ‌న్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నారు. గ‌త కొంత కాలంగా అప్పుడు ఇప్పుడు అంటూ ఊరిస్తూ వ‌స్తున్నారు.

మూవీకి సంబంధించి అప్ డేట్ ఇస్తూ వ‌స్తున్నారు. జీఎంబీ ప్రొడ‌క్ష‌న్స్ , మైత్రీ మూవీ మేక‌ర్స్ , 14 రీల్స్ సంయుక్తంగా నిర్మించారు ఈ స‌ర్కారువారి పాట‌ను. ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ఈ మూవీకి సంబంధించిన లిరిక‌ల్ సాంగ్ ఇవాళ విడుద‌ల చేశారు. క‌ళావ‌తీ అంటూ సిద్ శ్రీ‌రామ్ పాడితే అనంత్ శ్రీ‌రామ్ పాట‌ను రాశారు.

వాస్త‌వానికి వాలంటైన్స్ డే సంద‌ర్భంగా ఈ పాట‌ను విడుద‌ల చేయాల‌ని అనుకుంది చిత్ర యూనిట్. కానీ ఈ పాట‌కు సంబంధించి ముందే ఇంట‌ర్నెట్ లోకి వ‌చ్చేసింది.

దీంతో పైర‌సీకి పాల్ప‌డిన ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. షెడ్యూల్ కంటే ఒక రోజు రిలీజ్ చేసిన ఈ సాంగ్ (Sarkaru Vaari Paata Song)ఇప్పుడు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

భారీ ఎత్తున వ్యూయ‌ర్స్ తో దూసుకు పోతోంది. వందో ఒక వెయ్యో ఒక ల‌క్షో మెరుపులు దూకినాయా ఏందే ఈ మాయా క‌మా క‌మాన్ క‌ళావ‌తి నువ్వే లేకుంటే అధోగ‌తి అంటూ సాగింది ఈ పాట‌.

స‌ర్కారు వారి పాట మూవీని మే 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.

Also Read : ‘డీజే టిల్లు’ అదుర్స్ సిద్దూ సూప‌ర్

Leave A Reply

Your Email Id will not be published!