Punjab CM : మార్క్ ఫెడ్ ఉత్పత్తులకు ప్రయారిటీ – సీఎం
కార్న్ ఫ్లేక్స్ ను ప్రారంభించిన భగవంత్ మాన్
Punjab CM : ప్రపంచ వ్యాప్తంగా మార్క్ ఫెడ్ ద్వారా తయారు చేసిన ఉత్పత్తులకు ప్రాచుర్యం పొందేలా తీసుకు వస్తామని అన్నారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్(Punjab CM). శనివారం పంజాబ్ లోని ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మార్క్ ఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో అభివృద్ది చేసిన కార్న్ ఫ్లేక్స్ ను సీఎం భగవంత్ మాన్ ప్రారంభించారు. మార్క్ ఫెడ్ మరింత విస్తరించాలని, వినూత్నంగా ఉత్పత్తులను తయారు చేయాలని ఈ సందర్భంగా సూచించారు సీఎం.
ఇదే సమయంలో పంజాబ్ రాష్ట్ర రుచిని, అభిరుచుల్ని యావత్ ప్రపంచానికి తెలిసేలా చేయాలని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఉత్పత్తులు తయారు చేసేందుకు కావాల్సిన సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పారు భగవంత్ మాన్.
రాష్ట్రంలో కూడా మరింత విస్తరించాలని అన్నారు. ఇప్పటికే పంజాబ్ మార్క్ ఫెడ్ తయారు చేసే ఉత్పత్తులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉందన్నారు.
ఇతర దేశాలలో కూడా విక్రయించేలా చేయగలిగితే అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు. దీని వల్ల అదనంగా ఉపాధి కూడా లభిస్తుందని, ఉత్పత్తిదారుల (తయారీదారులు)కు మరింత భరోసా కలుగుతుందన్నారు.
దీని వల్ల బతికేందుకు కావాల్సిన ఆసరా ఏర్పడుతుందన్నారు. తమ లక్ష్యం ఒక్కటే అవినీతి రహిత రాష్ట్రంగా మార్చాలని అని చెప్పారు సీఎం(Punjab CM).
ఇదే సమయంలో విద్య, వైద్యం, ఉపాధి, పరిశ్రమల ఏర్పాటు పై ఎక్కువగా ఫోకస్ పెడతామన్నారు. పంజాబ్ లో ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వారితో కలిపి స్వయం సహాయక సంఘాలుగా ఏర్పాటు చేయాలన్నారు సీఎం.
Also Read : గౌహతి ఆఫర్ వచ్చినా వెళ్లలేదు – సంజయ్ రౌత్