Priyank Kharge : బీజేపీ చ‌ట్టానికి అతీతమా – ఖ‌ర్గే

ఎవ‌రైనా రాజ్యాంగానికి క‌ట్టుబ‌డాల్సిందే

Priyank Kharge : ఎవ‌రైనా స‌రే ఎంత‌టి వారైనా స‌రే చ‌ట్టానికి లోబ‌డి ఉండాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు క‌ర్ణాట‌క ఐటీ, హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే. చ‌ట్టాన్ని పాటించ‌డంలో భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఇబ్బంది ఉంటే , దాని ప‌ర్య‌వ‌సానాల‌ను త‌ప్ప‌నిస‌రిగా ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి. ఇదే స‌మ‌యంలో భార‌త రాజ్యాంగం ప్రకారం తాము న‌డుచుకుంటామ‌ని పేర్కొన్నారు. ఇందులో అభ్యంత‌రం తెలియ చేసేందుకు అవ‌స‌రం ఏమొచ్చింద‌ని ప్ర‌శ్నించారు ప్రియాంక్ ఖ‌ర్గే(Priyank Kharge).

ఇదిలా ఉండ‌గా గ‌త కొన్ని రోజులుగా బీజేపీ ఐటీ శాఖ మంత్రిని ట్రోల్ చేస్తూ వ‌స్తోంది. ఆయ‌న తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. సోమ‌వారం మీడియాతో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టికే హోం శాఖ‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చామ‌ని చెప్పారు. వ్య‌వ‌స్థ‌ల‌ను అడ్డుకోవాల‌ని అనుకోవ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఇప్ప‌టికే కులం పేరుతో, మ‌తం పేరుతో, వివాదాలు సృష్టించ‌డం బీజేపీకి , దాని అనుబంధ సంస్థ‌ల‌కు అల‌వాటుగా మారింద‌ని ఆరోపించారు.

ఈ రాష్ట్రంలో ప్ర‌భుత్వం రాజ్యాంగాన్ని అనుస‌రించి ఏర్ప‌డింది. దాని ప్ర‌కార‌మే తాము న‌డుచుకుంటామ‌ని , కానీ దానికి వ్య‌తిరేకంగా మేం వ్య‌వ‌హ‌రిస్తామ‌ని అనుకుంటే బీజేపీకి ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో మ‌రో ప్ర‌శ్నే లేద‌న్నారు. ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉండాల్సిందేన‌ని పేర్కొన్నారు. త‌మ‌కు తోచిన విధంగా చేస్తామంటే లా అండ్ ఆర్డ‌ర్ కు ఇబ్బంది ఏర్ప‌డుతుంద‌న్నారు.

Also Read : CM KCR Convoy : భారీ కాన్వాయ్ తో కేసీఆర్ హ‌ల్ చ‌ల్

Leave A Reply

Your Email Id will not be published!