Priyanka Chaturvedi : అమెరికా వత్తిళ్లను బేఖాతరు చేస్తూ ధీటుగా సమాధానం ఇచ్చిన భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ను ప్రశంసలతో ముంచెత్తింది శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది(Priyanka Chaturvedi ).
ఇప్పటికే దేశంలో కేంద్ర సర్కార్ కు మహారాష్ట్రలోని శివసేన సంకీర్ణ సర్కార్ కు పొసగడం లేదు. నువ్వా నేనా అన్న రీతిలో పోరాటం కొనసాగుతోంది.
ఇప్పటికే మహా వికాస్ అగాధీ సర్కార్ పై కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోంది మోదీ ప్రభుత్వం. సీఎం బావమరిదికి చెందిన ఆస్తులను జప్తు చేసింది.
ఇక ఇద్దరు మంత్రులను అదుపులోకి తీసుకుంది. చివరకు శివసేన పార్టీ అధికార ప్రతినిధి, ఫైర్ బ్రాండ్ గా పేరొందిన సంజయ్ రౌత్ తనయుడు, భార్యకు చెందిన రూ. 11 విలువ చేసే ఆస్తులను అటాచ్ చేసింది.
ఈ తరుణంలో నువ్వా నేనా అన్నంతగా పోరు కొనసాగుతోంది. అదే శివసేన పార్టీకి చెందిన ఎంపీ ప్రియాంక చతుర్వేది భారతీయ జనతా పార్టీకి చెందిన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ ను ప్రశంసలతో ముంచెత్తింది.
అమెరికాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఆయనకు కితాబు ఇచ్చింది. ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతాలో జై శంకర్ అమెరికా మీడియాకు ఇచ్చిన స్ట్రాంగ్ రిప్లై అద్భుతం అంటూ పేర్కొంది.
ప్రస్తుతం ప్రియాంక చతుర్వేది (Priyanka Chaturvedi )చేసిన ట్వీట్ కలకలం రేగింది. గతంలో అధికార బీజేపీకి మిత్రపక్షంగా మారిన చేదు ప్రత్యర్థి అయిన శివసేన నుంచి ప్రశంసలు రావడం విశేషం కదూ.
Also Read : షా కామెంట్స్ సర్వత్రా సీరియస్