Priyanka Chopra : ప్రియాంక చోప్రా కూతురు పేరు వెల్ల‌డి

మాల్తీ మేరీ చోప్రా జోనాస్ గా బ‌ర్త్ స‌ర్టిఫికెట్

Priyanka Chopra : ఇటు బాలీవుడ్ లో అటు హాలీవుడ్ లో త‌న న‌ట‌న‌తో దుమ్ము రేపుతున్న ఏకైక న‌టి ప్రియాంక చోప్రా(Priyanka Chopra). ఆమె న‌టినే కాదు హోస్ట్ కూడా. అంతేనా మంచి వ్యాపార‌వేత్త‌. అమెరికాలో ఓ ఇండియ‌న్ రెస్టారెంట్ న‌డుపుతోంది.

ఇది భారీ ఆదాయాన్ని మూట‌గ‌ట్టుకుంది. ఇక త‌న భ‌ర్త నిక్ జోనాస్ తో క‌లిసి అమెరికాలో ఉంటోంది ఈ ముద్దుగుమ్మ‌. హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో న‌టిస్తుండ‌గా ప్ర‌స్తుతం వెబ్ సీరీస్ లో కూడా ఎంట‌ర్ అయ్యింది ప్రియాంక చోప్రా.

ఇటీవ‌ల వీరిద్ద‌రూ స‌ర‌గోసి ప‌ద్ద‌తి ద్వారా ఓ పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. అయితే ఆ త‌న‌య‌కు ఏం పేరు పెట్టార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. దానికి తెర దించుతూ త‌న అభిమానుల‌కు గుడ్ న్యూస్ చెప్పారు ప్రియాంక చోప్రా.

నిత్యం నెట్టింట్లో ఫుల్ బిజీగా ఉండే ఈ తార ఏది చేసినా ఓ సంచ‌ల‌న‌మే. ఇదిలా ఉండ‌గా ఆమె కూతురు పేరు మాల్తీ మేరీ చోప్రా జోనాస్ అని పేరు పెట్టిన‌ట్లు వెల్ల‌డించింది తానే స్వ‌యంగా ప్రియాంక చోప్రా.

పాప‌కు వారి స్వంత ఇంటి పేర్లు వ‌చ్చేలా పెట్ట‌డం విశేషం. చోప్రా, జోనాస్ వ‌చ్చేలా చేశారు.మాల్తీ అనేది ఒక పువ్వు పేరు. ప్రియాంక త‌ల్లి పేరు కూడా. మ‌ధు మాల్తీలో ఒక భాగం.

జ‌న‌న ధ్రువీక‌ర‌ణ పత్రం ప్ర‌కారం జ‌న‌వ‌రి 15న శాన్ డియాగోలో బేబి మాల్తీ జ‌న్మించిన‌ట్లు తెలిసింది. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం ప్రియాంక చోప్రా షేర్ చేసిన పాప ఫోటోలు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

Also Read : మే 12న ధియేట‌ర్ల‌లో సర్కారు వారి పాట

Leave A Reply

Your Email Id will not be published!