Priyanka Gandhi : అగ్నిప‌థ్ స్కీం వెన‌క్కి తీసుకోవాలి – ప్రియాంక

మోదీ స‌ర్కార్ పై నిప్పులు చెరిగినా వాద్రా

Priyanka Gandhi : కేంద్ర ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన అగ్నిప‌థ్ స్కీంను వెంట‌నే వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ జ‌న‌త‌ర్ సెక్ర‌ట‌రీ ప్రియాంక గాంధీ వాద్రా.

ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద స‌త్యాగ్ర‌హ దీక్ష చేప‌ట్టారు. పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుల‌తో పాటు శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi)  దీక్ష‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఎలాంటి ముంద‌స్తు ప్ర‌ణాళిక లేకుండా ఈ స్కీంను తీసుకు వ‌చ్చార‌ని, దీని వ‌ల్ల న‌ష్టం త‌ప్ప భార‌త దేశానికి లాభం లేద‌ని మండిప‌డ్డారు.

ఇప్ప‌టికే దేశం అట్టుడుకి పోతోంద‌ని కానీ ప్ర‌ధాన మంత్రి మాత్రం నోరు విప్ప‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు. స్వ‌చ్ఛ భార‌త్, మ‌న్ కీ బాత్ , డిజిట‌ల్ భార‌త్ అంటున్నారే త‌ప్పా నిరుద్యోగుల ఇబ్బందులు ఏమిటో ఇప్ప‌టి వ‌ర‌కు గుర్తించ లేక పోయార‌ని ఎద్దేవా చేశారు.

దేశంలో 70 ల‌క్ష‌ల‌కు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయ‌ని , గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌తి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన‌ని మోదీ ప్ర‌క‌టించార‌ని కానీ ఇప్ప‌టి దాకా ఎక్క‌డ భ‌ర్తీ చేశారో చెప్పాల‌న్నారు.

అందువ‌ల్ల‌నే ఇవాళ యువ‌కులు పెద్ద ఎత్తున ఆందోళ‌న బాట ప‌ట్టార‌ని చెప్పారు. అయితే అగ్నిప‌థ్ స్కీంకు వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేస్తున్న వారంతా శాంతియుతంగా త‌మ నిర‌స‌న తెల‌పాల‌ని పిలుపునిచ్చారు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) .

ఎట్టి ప‌రిస్థితుల్లో దేశానికి సంబంధించిన ఆస్తుల‌ను ధ్వంసం చేయొద్ద‌ని కోరారు ఏఐసీసీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ.

Also Read : మోదీజీ ఇక‌నైనా క‌ళ్లు తెర‌వండి – పైల‌ట్

Leave A Reply

Your Email Id will not be published!