Priyanka Gandhi Viral : అపూర్వ ఆదరణ అనూహ్య స్పందన
ప్రచారం లో ప్రియాంక గాంధీ జోష్
Priyanka Gandhi : తెలంగాణలో ఎన్నికలు ఊపందుకున్నాయి. ప్రధాన పార్టీల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో జోరు కొనసాగుతోంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఊహించని రీతిలో ఆదరణ నెలకొంది. ఎక్కడికి వెళ్లినా పెద్ద ఎత్తున ఊహించని రీతిలో స్పందన లభిస్తోంది. దీంతో ఏఐసీసీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. జనం జేజేలు పలుకుతున్నారు.
Priyanka Gandhi Comment
కిలోమీటర్ పొడవునా నడుచుకుంటూ ప్రజలను కలిసేందుకు ప్రయత్నం చేశారు. ఓ వైపు సెక్యూరిటీ భారీ ఎత్తున పర్యవేక్షిస్తున్నా వారిని దాటుకుంటూ వెళ్లారు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi). దీంతో జనం ఆమెతో చేతులు కలిపేందుకు ముందుకు దూసుకు వచ్చారు. వారిని కంట్రోల్ చేయడం ఇబ్బందిగా మారింది.
చివరకు వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నం చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అయినా ప్రియాంక గాంధీ పట్టించు కోలేదు. ముందుకు దూసుకు వెళ్లారు. వేలాదిగా తరలి వచ్చిన ప్రజలను చూసి ఉద్వేగానికి లోనయ్యారు. సంతోషానికి లోనయ్యారు ప్రియాంక గాంధీ.
కాంగ్రెస్ పార్టీ వస్తుందని, ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతుందని ప్రకటించారు. అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. దొర పాలనలో అన్ని వ్యవస్థలు ఆగమాగమం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసంగం ముగిసే లోపు కాంగ్రెస్ పాటకు చప్పట్లు చరుస్తూ జోష్ నింపే ప్రయత్నం చేశారు ప్రియాంక గాంధీ.
Also Read : Rahul Gandhi : కొలువుల భర్తీకి కట్టుబడి ఉన్నాం
