Priyanka Gandhi Jodo Yatra : రాహుల్ యాత్ర‌లో ప్రియాంక గాంధీ

అడుగులు ఎప్పుడూ బ‌లంగా ఉంటాయి

Priyanka Gandhi Jodo Yatra : వాయ‌నాడు ఎంపీ, కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌కు ఊహించ‌ని రీతిలో ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. సెప్టెంబ‌ర్ 7న త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారి నుంచి దేశం ఐక్యత కోసం నినాదంతో యాత్ర‌ను ప్రారంభించారు. త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ , తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌ల‌లో ముగిసింది.

తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోకి ప్ర‌వేశించింది రాహుల్ యాత్ర‌. గురువారం ఖాండ్వా లోని బోర్గావ్ నుంచి మొద‌లైంది. త‌న సోద‌రుడి యాత్ర‌లో సోద‌రి , పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi Jodo Yatra) వాద్రా పాల్గొన్నారు. భారీ ఎత్తున పాల్గొన్నారు. చిన్నారులు, పెద్ద‌లు, యువ‌తీ యువ‌కులు, అన్ని వ‌ర్గాల‌కు చెందిన వారు కుల మ‌తాల‌కు అతీతంగా పాల్గొంటున్నారు.

ఇదే స‌మ‌యంలో దేశానికి ద్వేషం కాదు ప్రేమ కావాల‌ని కోరుతున్నారు రాహుల్ గాంధీ. ప్ర‌స్తుతం భార‌తీయ జ‌న‌తా పార్టీ కొలువు తీరిన రాష్ట్రంలో కొన‌సాగుతుండ‌డం విశేషం. మ‌రో వైపు గుజ‌రాత్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాల‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. 27 ఏళ్లుగా గుజ‌రాత్ లో కంటిన్యూగా పాల‌న సాగిస్తోంది భార‌తీయ జ‌న‌తా పార్టీ.

ఇదిలా ఉండ‌గా ఖ‌ర్గోన్ కు వెళ్లే ముందు రాహుల్ గాంధీ గిరిజ‌నులు ఆరాధ్య దైవంగా భావించే స్వాతంత్ర స‌మ‌ర యోధుడు తాంతియా భీల్ జ‌న్మ స్థ‌లాన్ని సంద‌ర్శిస్తారు. ఆదివాసీ గిరిజ‌నుల‌కు చేరువ‌య్యేందుకు కాంగ్రెస్ ప్ర‌య‌త్నం చేస్తోంది. మ‌రో వైపు బీజేపీ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.

2018లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాన్ని బీజేపీ య‌త్నించిందంటూ ఆరోపించారు రాహుల్ గాంధీ.

Also Read : ఏపీపీసీసీ చీఫ్ గా గిడుగు రుద్ర‌రాజు

Leave A Reply

Your Email Id will not be published!