Priyanka Gandhi : రాహుల్ యాత్రలో చేరనున్న ప్రియాంక
భారత్ జోడో యాత్రకు భారీ ఆదరణ
Priyanka Gandhi : తన సోదరుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్య ప్రదేశ్ కు చేరుకున్న వెంటనే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ జత కట్టనున్నారు. ఇప్పటి వరకు రాహుల్ గాంధీ దేశం ద్వేషంతో విడి పోకూడదని ప్రేమ కావాలంటూ నినాదంతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
ఇప్పటికే తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన యాత్ర మహారాష్ట్రతో ముగిసింది. అంతకు ముందు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలలో పూర్తయింది. ఈనెల 23న బుధవారం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోకి ఎంటర్ కానుంది. ఇప్పటికే 1200 కిలోమీటర్లకు పైగా పూర్తయింది.
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కొనసాగనుంది ఈ యాత్ర. మొత్తం 3,678 కిలోమీటర్ల వరకు కొనసాగనుంది. చిన్నారుల నుంచి పెద్దల దాకా పాదయాత్రలో పాల్గొంటున్నారు. సినీ రంగానికి చెందిన వారు కూడా రాహుల్ గాంధీతో జత కట్టారు. పూజా పట్ , రియా సేన్ , పూనమ్ కౌర్ మద్దతు పలికారు.
మహాత్మా గాంధీ ముని మనుమడు తుషార్ గాంధీ కూడా రాహుల్ తో నడిచారు. ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తన తాతను చంపేందుకు ఆర్ఎస్ఎస్ సిద్దాంతకర్త డీవీ సావర్కర్ గాడ్సేకు తుపాకి ఇచ్చారంటూ మండిపడ్డారు.
ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) పాదయాత్రలో పాల్గొననున్నట్లు వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ మీడియా ఇం ఛార్జి జైరాం రమేష్. మరో వైపు మోదీ సర్కార్ ను ఏకి పారేస్తున్నారు రాహుల్ గాంధీ.
Also Read : గాడ్సేకు తుపాకి ఇచ్చింది సావర్కరే