Priyanka Gandhi : ఖానాపూర్ – కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆసిఫాబాద్, ఖానాపూర్ లలో జరిగిన సభల్లో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో కొలువు తీరిన బీఆర్ఎస్ , కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ రెండూ ఒక్కటేనని అన్నారు. ఇద్దరూ ఒకరిపై మరొకరు బయటకు తిట్టుకుంటారని లోపట మాత్రం ఒక్కటేనని మండిపడ్డారు.
Priyanka Gandhi Comment
బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్టేనని అన్నారు. ఒకవేళ బీజేపీకి ఓటు వేసినా అది బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చినట్టేనని ఎద్దేవా చేశారు. ఇక బీఆర్ఎస్, బీజేపీకి ఓ నమ్మకమైన తమ్ముడు ఉన్నారని ఆ పార్టీ ఏమింటే అందరికీ తెలిసిందే ఎంఐఎం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రియాంక గాంధీ.
ఇక బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలన్నీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు డ్యాన్సులు చేస్తున్నాయంటూ సెటైర్ వేశారు. వీళ్ల డ్యాన్సులు చూడండి అని కానీ ఓట్లు మాత్రం తమ పార్టీకి వేయాలని పిలుపునిచ్చారు ప్రియాంక గాంధీ. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను బురిడీ కొట్టించారంటూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.
Also Read : Astrotalk CEO : భారత్ కప్ గెలిస్తే రూ. 100 కోట్లు