Priyanka Gandhi : కేసీఆర్ ను దించితేనే కొలువులు వస్తాయి
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ
Priyanka Gandhi : గద్వాల – ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం గద్వాలలో జరిగిన విజయ భేరి సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా జాబ్స్ ఖాళీగా ఉన్నా ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్నా ఎందుకని మౌనంగా ఉన్నారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్ పై ఉందన్నారు.
Priyanka Gandhi Comments on KCR
రాష్ట్రంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తం అవుతోందన్నారు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi). అన్నీ స్కామ్ లు ఈ స్కీమ్ లంటూ ఎద్దేవా చేశారు. యువత నిరుద్యోగంతో సతమతం అవుతోందన్నారు. గురుకులాల పేరుతో విద్యార్థులను కులం పరంగా చీల్చారంటూ ఆరోపించారు.
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో కొలువు తీరిన సీఎంను సాగనంపేందుకు ప్రజలు రెడీగా ఉన్నారని జోష్యం చెప్పారు. ఇవాళ ప్రజల తెలంగాణకు దొరల తెలంగాణకు మధ్య జరుగుతున్న పోరాటమని అభివర్ణించారు ప్రియాంక గాంధీ.
కర్ణాటకలో ఏర్పాటైన తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో సైతం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేసి తీరుతామని ప్రకటించారు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేశామన్నారు.
Also Read : JP Nadda : బీఆర్ఎస్..కాంగ్రెస్ ఒక్కటే