Priyanka Gandhi : అబ‌ద్దాలు చెప్ప‌డంలో మోదీ దిట్ట

నిప్పులు చెరిగిన ప్రియాంక గాంధీ

Priyanka Gandhi : ఏఐసీసీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. మే 10న క‌ర్ణాట‌క‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. ఎన్నిక‌ల స‌భల్లో పాల్గొంటున్నారు. ఈసారి రాష్ట్రంలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీ స‌ర్కార్ కు ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మ‌ధ్య పోరు కొన‌సాగుతోంది.

ఈ త‌రుణంలో బుధ‌వారం జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప్రియాంక గాంధీ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు. క‌ర్ణాట‌క‌ను దేశంలోనే టాప్ లో నిల‌బెడ‌తానంటూ ప‌దే ప‌దే ప్ర‌ధాన‌మంత్రి చెప్పార‌ని మ‌రి ఇంత కాలం ఏం చేశార‌ని ప్ర‌శ్నించారు. తొమ్మిది సంవ‌త్స‌రాలుగా దేశానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న న‌రేంద్ర మోదీ నిద్ర పోయారా అంటూ నిల‌దీశారు.

మాయ మాట‌లు చెప్ప‌డంలో, అబ‌ద్దాల‌ను ప్ర‌చారం చేయ‌డంలో ప్ర‌ధాన మంత్రి(Priyanka Gandhi) ఆరి తేరారంటూ మండిప‌డ్డారు ప్రియాంక గాంధీ. ప్ర‌జ‌లు ప్ర‌స్తుత ప్ర‌భుత్వాన్ని న‌మ్మే స్థితిలో లేరన్నారు. వాళ్లు స్ప‌ష్టంగా మెరుగైన పాల‌న రావాల‌ని కోరుకుంటున్నార‌ని చెప్పారు. క‌ర్ణాట‌క‌లో మార్పు త‌థ్య‌మ‌ని , కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు ప్రియాంక గాంధీ.

Also Read : మోదీ క‌ళ్లు మూసుకున్న ప్ర‌ధాని

Leave A Reply

Your Email Id will not be published!