Priyanka Gandhi : పాల‌మూరుకు రానున్న ప్రియాంక‌

అక్టోబ‌ర్ 31న బ‌హిరంగ స‌భ‌కు హాజ‌రు

Priyanka Gandhi : హైద‌రాబాద్ – తెలంగాణ‌లో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. కాంగ్రెస్ పార్టీ ప్ర‌స్తుతం అధికార పార్టీకి ధీటుగా ప్ర‌చారం చేస్తోంది. ఇప్ప‌టికే ఎన్నిక‌ల క్యాంపెయిన్ ను స్టార్ట్ చేసింది. ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ బ‌స్సు యాత్ర‌లో పాల్గొన్నారు. రెండో విడ‌త అక్టోబ‌ర్ 28 నుంచి ప్రారంభం కానుంది.

Priyanka Gandhi will come to Palamuru

మ‌రో వైపు ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో ఏఐసీసీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) హాజ‌రు కానున్నారు. ఈ విష‌యాన్ని టీపీసీసీ వెల్ల‌డించింది. పార్టీ అభ్య‌ర్థిగా మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు పోటీ చేస్తున్న కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించే పాల‌మూరు ప్ర‌జా భేరి స‌భ‌లో పాల్గొంటారు ప్రియాంక గాంధీ.

బీఆర్ఎస్ పార్టీ నుండి స‌స్పెన్ష‌న్ వేటుకు గురైన జూప‌ల్లి కొల్లాపూర్ లో స‌భ నిర్వ‌హించి పార్టీలో చేరాల‌ని భావించారు. కానీ భారీ వ‌ర్షాల కార‌ణంగా రెండుసార్లు స‌భ వాయిదా ప‌డింది. దీంతో గ‌త్యంత‌రం లేక జూప‌ల్లి కృష్ణారావు ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే స‌మ‌క్షంలో పార్టీలో చేరారు.

త‌న ఆధ్వ‌ర్యంలో స‌భ చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. క‌నీసం 10 ల‌క్ష‌ల మందితో స‌భ‌ను చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. దీంతో అంద‌రి క‌ళ్లు కొల్లాపూర్ పై ప‌డ్డాయి. ఏ మేర‌కు స‌క్సెస్ అవుతుందో వేచి చూడాలి.

Also Read : Rahul Bus Yatra : 28 నుంచి రాహుల్ బ‌స్సు యాత్ర‌

Leave A Reply

Your Email Id will not be published!