Bharat Jodo Nyay Yatra: రాహుల్ “భారత్ జోడో న్యాయ్ యాత్ర” లో ప్రియాంకగాంధీ !
రాహుల్ "భారత్ జోడో న్యాయ్ యాత్ర" లో ప్రియాంకగాంధీ !
Bharat Jodo Nyay Yatra: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో యూపీలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర శనివారం ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ నుంచి తిరిగి ప్రారంభమైంది. ఈ యాత్రలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ, ప్రియాంక వాద్రాలకు వివిధ వర్గాల ప్రజలు స్వాగతం పలికారు. వారి రాకను స్వాగతిస్తూ జనం వారిపై పూల వర్షం కురిపించారు. ఈ సమయంలో సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు కూడా యాత్రలో పాల్గొన్నారు. ఆదివారం అమ్రోహా, సంభాల్, బులంద్‌షెహర్, అలీగఢ్, హత్రాస్, ఆగ్రా మీదుగా సాగి ఫతేపూర్ సిక్రీ వద్ద యాత్ర ముగుస్తుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆదివారం ఆగ్రాలో జరిగే కాంగ్రెస్ యాత్రలో పాల్గొంటారు.
Bharat Jodo Nyay Yatra Updates
భారత్ జోడో న్యాయ్ యాత్ర చందౌలీలోకి ప్రవేశించిన సమయంలో ప్రియాంక గాంధీ యాత్రలో పాల్గొనవలసి ఉంది. అయితే అనారోగ్యం కారణంగా ఆమె యాత్రలో చేరలేదు. ఫిబ్రవరి 27, 28 తేదీల్లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ(Rahul Gandhi) రెండు ప్రత్యేక ఉపన్యాసాలు ఇవ్వడానికి యూకే వెళ్తుంండటంతో ఫిబ్రవరి 26 నుంచి మార్చి1 వరకు యాత్రకు విరామం ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. మార్చి 2న ధోల్ పూర్ నుంచి యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. మధ్యప్రదేశ్ మీదుగా రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటు మొరెనా, గ్వాలియర్, శివపురి, గుణ, షాజాపూర్, ఉజ్జయినిలలో కొనసాగుతుంది.
Also Read : TDP Janasena First List: టీడీపీ, జనసేన కూటమిల మొదటి జాబితా విడుదల !