Egypt President : అతిథిగా రావడం అదృష్టం – ప్రెసిడెంట్
ఈజిప్టు ప్రెసిడెంట్ కు సాదర స్వాగతం
Egypt President : రేపే భారత గణతంత్ర దినోత్సవం. ప్రతి సారి రిపబ్లిక్ డేను పురస్కరించుకుని ఒక్కో దేశాన్ని పిలవడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సారి ఆ గౌరవ అతిథిగా పాల్గొనే అవకాశం ఈజిప్టు ప్రెసిడెంట్(Egypt President) ఎల్ సీసీకి లభించింది. ఈ సందర్బంగా ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచంలో అత్యున్నతమైన ప్రజాస్వామ్య దేశమైన భారత్ దేశం నుంచి తనకు ఆహ్వానం అందడం ఆనందంగా ఉందన్నారు.
ఇదిలా ఉండగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 24న సాయంత్రం న్యూఢిల్లీకి చేరుకున్నారు.ఈ సందర్భంగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ ఎల్ సీసీ 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. అద్భుతమైన జాతీయ దినోత్సవానికి తాను హాజరు కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా ఇండియాకు రావడం ఆయన ఇదే తొలిసారి.
జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ గొప్ప రోజు కోసం నేను భారత దేవానికి, ప్రభుత్వానికి , ప్రజలకు నా అభినందనలు తెలియ చేస్తున్నానని స్పష్టం చేశారు. గౌరవ అతిథిగా పాల్గొనడం, అద్భుతమైన జాతీయ దినోత్సవంలో పాల్గొనడం గొప్ప అదృష్టమని పేర్కొన్నారు అబ్దుల్ ఫతాహ్ లె్ సీసీ(Egypt President) .
గత కొన్నేళ్లుగా ఈజిప్టు, భారతదేశం మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయి. మరింత బలపడాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. భారత దేశం స్థిరమైన అభివృద్ది అనుభవాన్ని తాను దగ్గరుండి చూస్తున్నానని అన్నారు ఈజిప్టు ప్రెసిడెంట్ . భారత్ కు చేరుకున్న ప్రెసిడెంట్ కు ప్రెసిడెంట్ ముర్ము, ప్రధాని మోదీ సాదర స్వాగతం పలికారు. ఈనెల 27 వరకు భారత్ లో ఉంటారు.
Also Read : రాహుల్ యాత్రకు జనం జేజేలు