PT Usha Wrestllers Comment : మసకబారిన ‘ఉషో’దయం
మహిళా రెజ్లర్లపై కామెంట్స్
PT Usha Wrestllers Comment : నిన్నటి దాకా పిటి ఉష అంటే ఈ దేశంలో చాలా గౌరవం ఉండేది. కానీ ఆమె ఎప్పుడైతే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ గా అయ్యిందో ఆనాటి నుంచి నేటి దాకా చేస్తున్న కామెంట్స్ మరింత ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయి. తను కూడా ఒకప్పుడు అథ్లెట్ నన్న విషయం మరిచి పోయి మాట్లాడటం విస్తు పోయేలా చేసింది.
ఇవాళ దేశ వ్యాప్తంగా పిటి ఉష(PT Usha Wrestllers Comment) చర్చనీయాంశంగా మారారు. ఒక రకంగా గత కొంత కాలం నుంచి ఆమె సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నారు. ట్రోల్ కూడా గురవుతున్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం, బంగారు పతకాన్ని తీసుకు రావడం వరకు ఎలాంటి అభ్యంతరం లేదు. కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పిటి ఉషను గుర్తించింది. ఆమెకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది. ఆపై గౌరవ సూచకంగా స్పీకర్ సీటులో కూర్చునే ఛాన్స్ కూడా ఇచ్చింది.
దేశం కోసం ఆడుతున్న వాళ్లు, తమ జీవితాన్ని త్యాగం చేసిన వాళ్లు, దేశ ప్రతిష్టను ప్రపంచ వేదికపై పెంపొందించేలా చేసిన వాళ్లను ప్రస్తావించడం, గుర్తించడం, ప్రోత్సహించడం మంచిదే. కానీ ఒక మహిళ అయి ఉండి సాటి మహిళల గురించి చులకనగా మాట్లాడటం తీవ్ర దుమారానికి దారి తీసింది. ఇలాంటి సున్నిత అంశాలపై మాట్లాడేటప్పుడు లేదా స్పందించేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని మాట్లాడాలి.
ఆ మాత్రం పిటి ఉషకు తెలియదని అనుకోవడానికి వీలు లేదు. ఆమె బీజేపీ సర్కార్ కనుసన్నలలో నడుస్తోంది. ప్రస్తుతం క్రీడా రంగం మొత్తం కాషాయమమై పోయింది. బీసీసీఐ అమిత్ షా కొడుకు జే షా(Jay shah) కనుసన్నలలో నడుస్తోంది. ఇక క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఇది పక్కన పెడితే. తాము లైంగిక వేధింపులకు గురవుతున్నామని, ఇక తట్టుకోలేమంటూ మహిళా రెజ్లర్లు 30 మందికి పైగా బయటకు వచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి లో రోడ్డెక్కారు. ఆందోళన చేపట్టారు. వాళ్లు ప్రధానంగా చేసిన ఆరోపణలు భారత రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ , బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై. ఆయన తన పదవిని అడ్డం పెట్టుకుని లైంగికంగా వేధిస్తున్నాడని వాపోయారు. కన్నీటి పర్యంతమయ్యారు.
ఏకంగా 1,000 మందిని టార్చర్ చేశాడంటూ సంచలన ఆరోపణలు చేశారు బబితా ఫోగట్. దీనిపై విచారణకు ఆదేశించింది కేంద్రం. మేరీ కోమ్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ తేల్చింది ఏమీ లేదు. చివరకు బ్రిజ్ భూషణ్ కు అనుకూలంగా తయారు చేశారంటూ రెజ్లర్లు ఆరోపించారు.
ఇదే సమయంలో మహిళా రెజ్లర్లపై నోరు పారేసుకున్నారు పీటీ ఉష(PT Usha). దేశ పరువును బజారుకు ఈడ్చారంటూ పేర్కొంది. ఆమె చేసిన కామెంట్స్ పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఓ వైపు రెజ్లర్లు కన్నీళ్లు పెడుతుంటే భరోసా ఇవ్వాల్సింది పోయి బాధ పెట్టేలా వ్యాఖ్యలు చేస్తారాంటూ మండిపడ్డారు క్రీడాభిమానులు.
గత్యంతరం లేక ఉష జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన రెజ్లర్ల వద్దకు వచ్చారు. కానీ మరోసారి నోరు పారేసుకున్నారు. నిరసన క్రమశిక్షణా రాహిత్యానికి ప్రతీక అంటూ మండిపడ్డారు. మొత్తంగా ఇప్పటి దాకా ఉషపై ఉన్న గౌరవం కూడా పోయిందని రెజ్లర్లు పేర్కొన్నారు. ఉష(PT Usha) ఇక కాషాయ జెండా కప్పుకుంటే బెటర్ కదూ.
Also Read : బీజేపీది ద్వేష పూరిత ఎజెండా