Modi Rally : దేశంలోని ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. నాలుగు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ విజయ కేతనం ఎగుర వేసింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ(Modi Rally) తన స్వస్థలం గుజరాత్ రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటన నిమిత్తం ఇవాళ గుజరాత్ కు చేరుకున్నారు.
ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అపూర్వమైన రీతిలో ఘన స్వాగతం పలికారు. ఈ ర్యాలీని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర దామోదర దాస్ మోదీ(Modi Rally) ప్రసంగించారు.
ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గతంలో పాలకులు తమ భవంతుల్లో మునిగి పోయారన్నారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక పేదలు, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు.
ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా తాము ప్రయత్నం చేశామని చెప్పారు. ఈ ఎన్నికల ద్వారా ప్రజలు ఇచ్చిన తీర్పు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ పనితీరుకు దర్పణంగా నిలుస్తుందన్నారు.
విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, పరిశ్రమల ఏర్పాటుపై ఎక్కువగా ఫోకస్ పెట్టామన్నారు. అంతే కాకుండా ప్రపంచానికి మార్గదర్శకంగా ఉండేలా డిజిటల్ భారతం కోసం ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థలు పెను మార్పులు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలోని పంచాయతీరాజ్ సంస్థలలోని మూడు అంచెల నుంచి లక్ష మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా గుజరాత్ పంచాయతీ మహా సమ్మేళనంలో పాల్గొంటారు.
Also Read : ప్రజా తీర్పు శిరోధార్యం