Punjab Assembly : చండీగఢ్ కోసం పంజాబ్ తీర్మానం

బ‌దిలీ చేయ‌క‌పోతే ఆందోళ‌న

Punjab Assembly : చండీగ‌ఢ్ (chandigarh) పారిపాల‌న‌లో స‌మ‌తుల్య‌త‌ను దెబ్బ తీసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం య‌త్నిస్తోందంటూ పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్(Punjab Assembly) నిప్పులు చెరిగారు. త‌క్ష‌ణ‌మే చండీగ‌ఢ్ ను పంజాబ్ (Punjab) రాష్ట్రానికి బ‌దిలీ చేయాల‌ని డిమాండ్ చేశారు.

లేక పోతే యుద్దం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. మోదీ (Modi) స‌ర్కార్ కావాల‌ని బీజేపీ (BJP) యేత‌ర ప్ర‌భుత్వాల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తోందంటూ మండిప‌డ్డారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు.

కేంద్ర పాలిత ప్రాంతాన్ని నిర్వ‌హించ‌డంలో కేంద్రం స‌మ‌తుల్య‌త‌ను దెబ్బ తీసేందుకు ప్ర‌య‌త్నిస్తోందంటూ ఆరోపించారు. చండీగ‌ఢ్ (Chandigarh) ను వెంట‌నే పంజాబ్ కు బ‌దిలీ చేయాల‌ని కోరుతూ పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ (Bhagwanth Mann) అసెంబ్లీలో(Punjab Assembly) తీర్మానాన్ని ప్ర‌వేశ పెట్టారు.

పంజాబ్ (Punjab) , హ‌ర్యానాకు (Haryana) రాజ‌ధానిగా ప‌ని చేస్తున్న కేంద్ర పాలిత ప్రాంతాన్ని నియంత్రించేందుకు కేంద్రం ప్ర‌య‌త్నించ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు భ‌గ‌వంత్ మాన్. ఇరు రాష్ట్రాల మ‌ధ్య తగాదాలు నెల‌కొన్నాయి.

ఇప్ప‌టికే మోదీ త్ర‌యం ( మోదీ, అమిత్ షా, జేపీ న‌డ్డా ) మ‌హారాష్ట్ర‌, ఏపీ, ఢిల్లీ, తెలంగాణ‌, ప‌శ్చిమ బెంగాల్, త‌మిళ‌నాడు, కేర‌ళ‌, చండీగ‌ఢ్, రాజ‌స్థాన్ , పంజాబ్ రాష్ట్రాల‌తో గిల్లి క‌జ్జాలకు దిగుతోంది.

అయిన దానికి కాని దానికి ఇబ్బందుల‌కు గురి చేసే ప‌నిలో ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతోంది. తాజాగా చండీగ‌ఢ్ కు స‌ర్వాధికారాలు త‌మ ప‌రిధిలో పెట్టుకోవాల‌ని చూస్తోంది.

తాజాగా పంజాబ్ (Punjab) లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 117 సీట్ల‌కు గాను ఆప్ 92 సీట్లు చేజిక్కించుకుని ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది. ఇలాంటి ప‌రిస్థితి ఢిల్లీలో కూడా నెల‌కొంది. దీనిపై అభ్యంతం తెలుపుతూ వ‌స్తోంది ఆప్ స‌ర్కార్.

Also Read : న్యాయానికి దిక్కేది బాధితుల‌కు భ‌రోసా ఏది

Leave A Reply

Your Email Id will not be published!