Bhagwant Mann : అమర వీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ పంజాబ్ సీఎం భగవత్ మాన్(Bhagwant Mann )అవినీతి నిరోధక హెల్ప్ లైన్ విడుదల చేశారు. హుస్సేనివాలా ఫిరోజ్ పూర్ లో సర్దార్ షహీద్ భగత్ సింగ్ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు భగవంత్ మాన్.
ఈ సందర్భంగా ఆయన సీఎంగా కొలువు తీరిన వెంటనే ఎవరైనా అవినీతి, అక్రమాలకు పాల్పడినా లేదా లంచం అడిగినా వెంటనే తన ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా తన మొబైల్ నెంబర్ 9501200200 కు ఫోన్ చేయాలని తెలిపారు. వీడియో ద్వారా లేదా మెస్సేజ్ ను ఈ నెంబర్ కు ఉన్న వాట్సాప్ కు మెస్సేజ్ చేయాలంటూ సీఎం సూచించారు.
షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ కన్న కలలను నిజం చేసేందుకు నేను ఇక్కడ ఉన్నా. వారి ఆశయాలకు అనుగుణంగానే తమ ప్రభుత్వం నడుస్తుందన్నారు. పాలన మరింత పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
పంజాబ్ రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రంగా చేయాలన్నదే తమ లక్ష్యమని ప్రకటించారు భగవంత్ మాన్. ఎవరైనా లంచం అడిగితే మీరు తిరస్కరించకండి అడిగిన వారికి సంబంధించిన వీడియోను తీయండి . లేదా మెస్సేజ్ పెట్టండి.
ఎవరూ భయపడాల్సిన పని లేదు. ఇది ప్రజల ప్రభుత్వమని స్పష్టం చేశారు భగవంత్ మాన్(Bhagwant Mann ). ఈ విషయంలో ప్రజల మద్దతు తనకు కావాలన్నారు సీఎం. అవినీతి పరుల భరతం పడతానని హెచ్చరించారు సీఎం.
Also Read : ప్రతి నెలా ఎన్నికలు జరిగితే బెటర్