Bhagwant Mann : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంచలన ప్రకటన చేశారు. ఇవాళ ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో జాబ్స్ భర్తీ విషయం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలలో ప్రస్తుతానికి 25 వేల జాబ్స్ భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం.
ఇందులో 10 వేల పోస్టులు పోలీసు శాఖలో మిగతా 15 వేల ఉద్యోగాలను బోర్డులు, కార్పొరేషన్లు, ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేస్తామని వెల్లడించారు.
కాగా కొలువుల భర్తీకి సంబంధించి ఆప్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైనా సిఫారసులు తీసుకు రావద్దని స్పష్టం చేశారు. ఒకరకంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు భగవంత్ మాన్(Bhagwant Mann). తన వారైనా మీ వారైనా నిజాయితీగా, నిబద్దతతో , ధర్మబద్దంగా ఉండాలని చెప్పారు.
ఈ సమావేశంలో రాఘవ్ చద్దా కూడా పాల్గొన్నారు. ఉద్యోగాలకు సంబంధించి మొహాలీలో ఆదివారం ప్రత్యేక సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన భగవంత్ మాన్(Bhagwant Mann) కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
ఇప్పటికే తనదైన ముద్ర వేస్తున్నారు పాలనా పరంగా. ప్రజల సంక్షేమం కోసం నిజాయితీగా పని చేయాలని చెప్పారు సీఎం. చాలా మంది మిమ్మల్ని జాబ్స్ ఇప్పించమంటూ సంప్రదిస్తారు.
కానీ తాను వీటిని ప్రోత్సహించను. ఆమ్ ఆద్మీ పార్టీలో అవినీతికి తావు లేదన్నాడు భగవంత్ మాన్. ఎన్నికల సందర్భంగా ఆప్ ప్రధానంగా నిరుద్యోగం గురించి ప్రస్తావించింది.
ఈ సందర్భంగా భగవంత్ మాన్ పనితీరుపై ప్రశంసల జల్లు కురిపించారు ఆప్ కన్వీనర్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. కేవలం మూడు రోజుల్లోనే చాలా గ్రౌండ్ ను కవర్ చేశాడని అన్నారు.
Also Read : చీఫ్ జస్టిస్ అవస్థికి ప్రాణ హాని..?