Punjab CM Budget : ప్రజలే రూపొందించిన బడ్జెట్ – సీఎం
విద్య..వైద్యం..ఉపాధి..వాణిజ్యంపై ఫోకస్
Punjab CM Budget : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(Punjab CM Budget) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ రాష్ట్ర చరిత్రలో ప్రజలు తమకు ఏం కావాలని కోరుకున్నారో వారి అభిప్రాయాలు, సూచనలు, సలహాల మేరకే తాము బడ్జెట్ ను రూపొందించడం జరిగిందని చెప్పారు.
అవినీతి, అక్రమాలకు తావు లేని రాష్ట్రంగా తీర్చి దిద్దడం తమ ముందున్న ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా బడ్జెట్ ను తయారు చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిని ప్రత్యేకంగా భగవంత్ మాన్ అభినందించారు.
అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రయారిటీ ఇస్తున్నామని చెప్పారు. గతంలో పాలకులు తమకు ఏం కావాలో దాని ప్రకారమే రాష్ట్ర బడ్జెట్ ను తయారు చేశారని ధ్వజమెత్తారు సీఎం.
కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రజలు ఏం కోరుకుంటారో వారికి అనుగుణంగా పని చేస్తుందని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ప్రజలందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని చాలా శ్రమించి తయారు చేశామని వెల్లడించారు.
ప్రధానంగా విద్య, వైద్యం, ఉపాధి, వాణిజ్యం, పరిశ్రమల ఏర్పాటుపై ఎక్కువగా ఈసారి బడ్జెట్(Budget) లో ఫోకస్ పెట్టామన్నారు. త్వరలోనే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు గాను క్లినిక్ లు (దవఖానాలు) ఏర్పాటు చేస్తామన్నారు భగవంత్ మాన్.
చదువు కోవడం వల్లనే వికాసం కలుగుతుందని, తద్వారా ఉన్నతమైన సమాజం ఏర్పడేందుకు దోహద పడుతుందన్నారు సీఎం.
తాము తీసుకు వచ్చిన కరప్షన్ ఫ్రీ నినాదానికి భారీ ఎత్తున స్పందన వచ్చిందన్నారు. ఇప్పటి వరకు పలువురిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. వ్యవసాయానికి కూడా ప్రయారిటీ ఇస్తామన్నారు సీఎం.
Also Read : యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు