Punjab CM Visits : కొండపోచమ్మను పరిశీలించిన సీఎం
సీఎం నియోజకవర్గంలో సీఎం టూర్
Punjab CM Visits : ఆమ్ ఆద్మీ పార్టీ, భారత రాష్ట్ర సమితి పార్టీల మధ్య బంధం మరింత బలపడింది. ఇప్పటికే పలు మార్లు పంజాబ్ , ఢిల్లీ సీఎంలు భగవంత్ మాన్ , అరవింద్ కేజ్రీవాల్ లు పర్యటించారు. వారికి అపూర్వమైన రీతిలో ఆతిథ్యం ఇచ్చారు బీఆర్ఎస్ చీఫ్ , సీఎం కేసీఆర్ . ఇదే సమయంలో కొత్తగా ఏర్పాటైన బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన తొలి బహిరంగ సభలో పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా. గురువారం మరోసారి తెలంగాణలో పర్యటించారు.
గజ్వేల్ నియోజకవర్గంలోని కొండ పోచమ్మ సాగర్ ను పరిశీలించారు సీఎం భగవంత్ మాన్(Punjab CM Visits). ఇవాళ పంజాబ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన సీఎం నేరుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా కొండ పోచమ్మ రిజర్వాయర్ ను పరిశీలించారు. అనంతరం మల్లన్న సాగర్ , పంప్ హౌస్ , పాండవుల చెరువును పరిశీలించారు.
ఇదిలా ఉండగా పర్యటనలో ఉన్న సీఎం భగవంత్ మాన్ కు కాళేశ్వరం ప్రాజెక్టు, భూగర్భ జలాల పెరుగుదల, మిషన్ కాకతీయ గురించి ఉన్నతాధికారులు సీఎం బృందానికి వివరించారు. ఈ సందర్బంగా అడిగిన పలు ప్రశ్నలకు కూలంకుశంగా సమాధానాలు ఇచ్చారు. 618 మీటర్ల ఎత్తులో దీనిని నిర్మించారు. 15 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ ను నిర్మించారు. దీని నిర్మాణం ద్వారా మొత్తం 2, 85, 280 ఎకరాలకు సాగు నీరు అందుతోంది.
రాష్ట్రంలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టుల గురించి తెలుసుకున్నారు సీఎం భగవంత్ మాన్. మల్లన్న సాగర్ , కొండ పోచమ్మ, గజ్వేల్ పాండవుల చెరువు, నర్సన్నపేట చెక్ డ్యామ్ లను కూడా పరిశీలించారు.
Also Read : బీజేపీ టార్గెట్ ఐఏఎస్ ఆఫీసర్ ట్రాన్స్ ఫర్