Punjab Governor : పంజాబ్ సీఎం మాన్ పై గవర్నర్ గుస్సా
ఆయన చేసిన ఆరోపణలన్నీ అబద్దాలే
Punjab Governor : పంజాబ్ లో ఆప్ సర్కార్ వర్సెస్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ మధ్య వివాదం మరింత ముదిరింది. గవర్నర్ పై సీఎంలు భగవంత్ మాన్, అరవింద్ కేజ్రీవాల్, ప్రభుత్వ సలహాదారు రాఘవ్ చద్దా షాకింగ్ కామెంట్స్ చేశారు.
గవర్నర్ తన పరిమితులకు మించి వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. ఆయనేమైనా ప్రభుత్వ డొమైనా అని మండిపడ్డారు చద్దా.
విచిత్రం ఏమిటంటే గతంలో జరిగిన పంజాబ్ శాసనసభా సమావేశాల వివరాలను గవర్నర్ కోరారని 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో రాష్ట్రపతులు, గవర్నర్లు ఎక్కడా అడిగిన దాఖలాలు లేవన్నారు సీఎం భగవంత్ మాన్.
మరో వైపు కేంద్రం ఒత్తిళ్ల మేరకే గవర్నర్ అలా చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ తరుణంలో తాజాగా తన పరిమితులు ఏమిటో, తనకు ఉన్న అధికారాలు ఏమిటో తనకు స్పష్టంగా తెలుసన్నారు గవర్నర్ పురోహిత్ (Punjab Governor).
తాను కూడా రూల్స్ ను చదువుకుంటానని, తనకు చదవడం, రాయడం వస్తుందని స్పష్టం చేశారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 167, 168 ప్రకారం తన పాత్రను గుర్తు చేయడాన్ని స్వాగతించారు గవర్నర్. ఇదిలా ఉండగా సమావేశాలకు సంబంధించి గవర్నర్ కేవలం లాంఛనప్రాయం మాత్రమేనని సీఎం భగవంత్ మాన్ పేర్కొనడాన్ని తప్పు పట్టారు పురోహిత్.
ఇదిలా ఉండగా తనపై ఆరోపణలు చేసేటప్పుడు సీఎం తన న్యాయ సలహాదారులను అడిగి ఉండాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
విశ్వాస తీర్మానం ఆమోదించాలని ఈనెల 22న గవర్నర్ కు ఆప్ సర్కార్ విన్నవించింది. దానిని ఆయన తిరస్కరించారు. ఈనెల 27న సాధారణ అసెంబ్లీ సమావేశాన్ని చేపట్టాలని కేబినెట్ తీర్మానం చేసింది.
Also Read : పీఎఫ్ఐని నిషేధించాలి- షహబుద్దీన్ రజ్వీ