Punjab Govt Library : రెస్టారెంట్ కాదు ప్ర‌భుత్వ లైబ్రరీ

హ్యాట్సాఫ్ పంజాబ్ సీఎం మాన్

Punjab Govt Library : ప్ర‌భుత్వం త‌లుచుకుంటే ఏమైనా చేయ‌గ‌ల‌ద‌ని నిరూపించారు పంజాబ్ సీఎం భ‌గవంత్ మాన్. ఆయ‌న ఓ టీచ‌ర్ కొడుకు. క‌మెడీయ‌న్ గా, స్టేజీ ఆర్టిస్టుగా పేరు పొందారు. అనంత‌రం ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఎంపీగా గెలుపొందారు. అనంత‌రం ఎమ్మెల్యేగా విజ‌యం సాధించి ఏకంగా పంజాబ్ కు ముఖ్య‌మంత్రిగా అయ్యారు. ఆయ‌న‌ను తాగుబోతు అన్నారు. ఆపై పార్ల‌మెంట్ కు తాగి వ‌చ్చాడంటూ ఆరోప‌ణ‌లు చేశారు. ఎయిర్ పోర్టు నుంచి దించేశారంటూ మండిప‌డ్డారు.

కానీ అదే భ‌గ‌వంత్ మాన్ త‌న త‌ల్లి సాక్షిగా తాగ‌నంటూ ప్ర‌మాణం చేశాడు. ఆపై పంజాబ్ ను అన్ని రంగాల‌లో టాప్ లో నిలిచేలా చేస్తాన‌ని ప్ర‌తిజ్ఞ చేశాడు. అంద‌రూ రాజ్ భ‌వ‌న్ వేదిక‌గా ప్ర‌మాణ స్వీకారం చేస్తే త‌ను మాత్రం ష‌హీద్ భ‌గ‌త్ సింగ్ స్మృతి వ‌నం సాక్షిగా , ప్ర‌జ‌ల మ‌ధ్య‌న సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసి చ‌రిత్ర సృష్టించాడు. అంతేనా కేబినెట్ లో అవినీతికి పాల్ప‌డ్డార‌ని తేలిన వెంట‌నే తొల‌గించిన ఏకైక సీఎం భ‌గ‌వంత్ మాన్(Bhagwant Mann).

ఆయ‌న కాంట్రాక్టు ఎంప్లాయిస్ ను ప‌ర్మినెంట్ చేశారు. లా అండ్ ఆర్డ‌ర్ ను గాడిలో పెట్టే ప్ర‌య‌త్నం చేశాడు. తాజాగా మ‌రో సంచ‌ల‌నానికి తెర లేపారు భ‌గ‌వంత్ మాన్. సంగ్రూర్ లో ఏకంగా క‌ళ్లు చెదిరే భ‌వంతిని క‌ట్టారు. అది ఏ రెస్టారెంటో అనుకుంటే పొర‌పాటు పడిన‌ట్లే. ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని గ్రంథాల‌యం. అక్క‌డ స‌క‌ల స‌దుపాయాలు ఏర్పాటు చేశాడు. ప్ర‌స్తుతం ఇంధ్ర‌భ‌వ‌నం లాగా ఉన్న ఇది లైబ్ర‌రీగా మార్చేశాడు. దాని రూపు రేఖ‌లు మార్చిన సీఎంకు ధ‌న్య‌వాదాలు చెప్ప‌కుండా ఉండ‌లేం.

Also Read : Tirumala : శ్రీ‌వారి ద‌ర్శ‌నం భ‌క్త సందోహం

Leave A Reply

Your Email Id will not be published!