Arvind Kejriwal : గుజ‌రాత్ లో పంజాబ్ సీన్ రిపీట్ – కేజ్రీవాల్

బీజేపీ ఆందోళ‌న..కాంగ్రెస్ ఎక్క‌డని ఎద్దేవా

Arvind Kejriwal : గుజ‌రాత్ లో అసెంబ్లీ ఎన్నిక‌ల వేడి ఊపందుకుంది. గ‌త 27 సంవ‌త్స‌రాలుగా భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్రంలో ప‌రిపాల‌న‌లో ఉంది. ప్ర‌స్తుతం నాలుగు స్తంభాలాట కొన‌సాగుతోంది. అధికారంలో ఉన్న బీజేపీతో పాటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం కూడా త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించు కోనున్నాయి.

ఓ వైపు రాహుల్ గాంధీ, మ‌రో వైపు అమిత్ చంద్ర షా, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, ఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీ హోరా హోరీగా ప్ర‌చారంలో నిమ‌గ్నం అయ్యారు. మాట‌ల తూటాలు పేలుస్తున్నారు. ఈసారి అన్ని పార్టీల కంటే ముందు నుంచే ప్ర‌చారం చేప‌ట్టారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal).

ఆదివారం ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. పంజాబ్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆప్ ను త‌క్కువ అంచ‌నా వేశార‌ని ఆయా పార్టీల‌ను ఉద్దేశించి అన్నారు అర‌వింద్ కేజ్రీవాల్. కానీ తాము చెప్పిన విధంగానే ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాయ‌న్నారు.

అన్ని ప్ర‌ధాన పార్టీలు నామ రూపాలు లేకుండా పోయాయ‌ని ఎద్దేవా చేశారు అర‌వింద్ కేజ్రీవాల్. గ‌తంలో ఏలిన కాంగ్రెస్ పార్టీ కంటిన్యూగా కొన‌సాగుతూ వ‌స్తున్న బీజేపీ గుజ‌రాత్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఏం చేశాయో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

ప్ర‌జ‌లు మార్పును కోరుకుంటున్నార‌ని, మెరుగైన‌, పార‌ద‌ర్శ‌క‌త‌తో కూడిన పాల‌న కావాల‌ని అనుకుంటున్నార‌ని చెప్పారు సీఎం. ఇదే స‌మ‌యంలో పంజాబ్ ఎన్నిక‌ల ఫ‌లితాలు గుజ‌రాత్ లో రిపీట్ అవుతాయ‌ని స్ప‌ష్టం చేశారు అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). మాయ మాట‌లు న‌మ్మే ప‌రిస్థితుల్లో జ‌నం లేర‌న్నారు. ఎన్ని వ్యూహాలు ప‌న్నినా, ఎన్ని కుట్ర‌ల‌కు దిగినా జ‌నం త‌మ‌కు ఓటు వేయాల‌ని డిసైడ్ అయ్యార‌ని పేర్కొన్నారు.

Also Read : తెగించే వ‌చ్చా తాట తీస్తా – ప‌వ‌న్ కళ్యాణ్

Leave A Reply

Your Email Id will not be published!