Gurmeet Singh Meet Hayer : పంజాబ్ క్రీడాకారుల‌కు స్టైఫండ్

క్రీడా మంత్రి గుర్మీత్  సింగ్ మీత్ హ‌యర్

Gurmeet Singh Meet Hayer : జాతీయ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారుల‌కు పంజాబ్ ప్ర‌భుత్వం ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. ఈ మేర‌కు నెల వారీగా స్టైఫండ్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ఈ విష‌యాన్ని రాష్‌ట్ర క్రీడా శాఖ మంత్రి గుర్మీత్ సింగ్ మీత్ హ‌యర్(Gurmeet Singh Meet Hayer) ప్ర‌క‌టించారు.

స్టైఫండ్ తో పాటు క్రీడాకారుల కోసం ప్ర‌భుత్వం ఆరోగ్య ప‌థ‌కాన్ని కూడా ప్రారంభించ‌నుంద‌ని వెల్ల‌డించారు. మంత్రి మీడియాతో మాట్లాడారు.

జాతీయ పోటీల్లో మొద‌టి మూడు స్థానాల‌లో నిలిచిన క్రీడాకారుల‌కు నెల వారీగా స్టైఫండ్ ను అందించే స్కాల‌ర్ షిప్ ప‌థ‌కాన్ని గుర్మీత్ సిగ్ మీట్ హెయిర్ ప్రారంభించారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం కొత్త స్పోర్ట్స్ పాల‌సీని కూడా ప్రారంభించ‌నుంద‌ని చెప్పారు. దీని కింద అంత‌ర్జాతీయ ఈవెంట్ల‌లో ప‌త‌కాలు గెలుచుకున్న వారికి నేరుగా క్రీడా శాఖ కింద ప్ర‌త్యేక కేడ‌ర్ ను సృష్టించ‌డం ద్వారా భ‌ర్తీ చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

ప్ర‌తి ఒక్క క్రీడాకురుడికి ఆరోగ్య బీమా(Health Insurance) అన్న‌ది ఉండాల‌న్నారు. అందుకే కొత్త‌గా ఈ ప‌థ‌కాన్ని కూడా అమ‌లు చేస్తామ‌న్నారు. ఒలింపియ‌న్ బ‌ల్బీర్ సింగ్ సీనియ‌ర్ స్కాల‌ర్ షిప్ ప‌థ‌కాన్ని ప్రారంభించారు.

సీనియ‌ర్ జాతీయ చాంపియ‌న్ షిప్ ల‌లో, స్పోర్ట్స్ ఈవెంట్ ల‌లో మొద‌టి మూడు స్థానాల‌ను కైవ‌సం చేసుకున్న పంజాబ్ ఆట‌గాళ్ల‌కు ఒక సంవ‌త్స‌రం పాటు నెల‌కు రూ. 8,000 ఇస్తామ‌న్నారు.

జూనియ‌ర్ నేష‌న‌ల్ మెడ‌ల్ ప్లేయ‌ర్ల‌కు నెల‌కు రూ. 6,000 చొప్పున చెల్లిస్తామ‌న్నారు. ఒక సంవ‌త్సరం త‌ర్వాత మ‌ళ్లీ ప‌త‌కాలు సాధిస్తే ఇదే స్టైఫండ్ కొన‌సాగుతుంద‌ని మంత్రి వెల్ల‌డించారు.

Also Read : భార‌త సెలెక్ట‌ర్ల‌పై అజ్జూ ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!