Punjab UP Election : నిన్నటి దాకా నువ్వా నేనా అన్న రీతిలో నిన్నటి దాకా కొనసాగిన ఎన్నికల ప్రచారం ముగిసింది. భారత దేశంలోని ఐదు రాష్ట్రాలలో ఎన్నికలకు ముహూర్తం పెట్టింది.
ఇప్పటికే మణిపూర్, ఉత్తరాఖండ్ , గోవా రాష్ట్రాలలో పోలింగ్ ముగిసింది. ఎందుకంటే ఆయా రాష్ట్రాలలో అతి తక్కువగా నియోజకవర్గాలు ఉండడమే.
ఇక పంజాబ్ లో ఇవాళ 117 నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఇక పంజాబ్ తో పాటు ఉత్తర ప్రదశ్ రాష్ట్రంలో(Punjab UP Election) మూడో విడత పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు విడతలుగా పోలింగ్ కొనసాగుతోంది.
ప్రస్తుతం యూపీలోని 16 జిల్లా ల్లోని 59 నియోజకవర్గాలకు పోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ పవర్ లో ఉంటే యూపీలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది.
యూపీలో ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల దాకా కొనసాగనుంది.పంజాబ్ లో ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది.
ఇక్కడ కూడా సాయంత్రం 6 గంటల దాకా కొనసాగనుంది పోలింగ్. ఇదిలా ఉండగా కడపటి వార్తలు అందేసరికి భారీ ఎత్తున ఓటర్లు కొలువు తీరారు.
ఇదిలా ఉండగా యూపీలోని కాన్పూర్ రూరల్ నియోజకవర్గంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ – ఈవీఎంలో తేడాలు ఉన్నాయంటూ సమాజ్ వాది పార్టీ ఆరోపించారు.
తమ పార్టీకి ఓటు వేస్తే ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ – వీవీపాట్ బీజేపీకి సంబంధించిన స్లిప్ ను జారీ చేసిందని పార్టీ ఆరోపించింది. పంజాబ్ సీఎం అభ్యర్థిగా డిక్లేర్ చేసిన భగవంత్ మాన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Also Read : ప్రశాంత్ కిషోర్ తో నితీష్ కుమార్ భేటీ