Puri Jagannadh : దేవరకొండ దమ్మున్నోడు – పూరీ
డైరెక్టర్ సంచలన కామెంట్స్
Puri Jagannadh : అంతా రౌడీ బాయ్ గా పిలుచుకునే విజయ్ దేవరకొండ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాడు. డైనమిక్ డైరెక్టర్ గా పేరొందిన పూరీ జగన్నాథ్(Puri Jagannadh) దర్శకత్వంలో అనన్య పాండేతో కలిసి లైగర్ ( సాలా క్రాస్ బ్రీడ్ ) మూవీలో నటించాడు.
ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతోంది. దీనిని తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ, తదితర భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ దుమ్ము రేపుతోంది. సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన పాటలన్నీ షేక్ చేస్తున్నాయి.
నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన కోకా 2.0 సాంగ్ షేక్ చేస్తోంది. ఇది పంజాబ్, రాజస్తానీ స్టైల్ లో చిత్రీకరించారు. ఇక చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ ను స్పీడ్ గా చేస్తోంది.
ఎక్కడికి వెళ్లినా వీరికి జనాదరణ లభిస్తోంది. తాజాగా హన్మ కొండ లో పర్యటించింది చిత్ర బృందం. ఈ సందర్బంగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మాట్లాడాడు.
విజయ్ దేవరకొండ దమ్మున్నోడని కితాబు ఇచ్చాడు. కరణ్ జోహార్, అపూర్వ మెహతా అందించిన సహకారం మరిచి పోలేనన్నాడు. అర్జున్ రెడ్డి చూశా.
అందులో నిజాయితీగా నటించిన విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) పై ఫోకస్ పెట్టా. ఏదో ఒక రోజు ఇతడితో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యానని చెప్పాడు పూరీ. లైగర్ లో ఎంతో కష్ట పెట్టా. అన్నింటినీ భరించాడు.
మొత్తంగా 100 శాతానికంటే ఎక్కువగా చేశాడని కితాబు ఇచ్చాడు. రూ. కోటి ఇచ్చా. తీసుకోలేదు. ముందు అప్పులు తీర్చండి అని చెప్పాడు విజయ్ దేవరకొండ.
Also Read : ఆకట్టుకున్న ‘జయ హే 2.0’ గీతం