Pushkar Singh Dhami : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా రెండోసారి కొలువు తీరారు పుష్కర్ సింగ్ ధామి(Pushkar Singh Dhami). రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో విచిత్రంగా ధామీ ఓటమి పాలయ్యారు. కానీ భారతీయ జనతా పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది.
రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఈ తరుణంలో బీజేపీ హైకమాండ్ ధామికి సీఎంగా ఛాన్స్ ఇవ్వదని అనుకున్నారంతా. కానీ ఊహించని రీతిలో ఆయనకే అవకాశం వచ్చింది.
సీఎం ప్రమాణ స్వీకారానికి ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా,
రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ , భారతీయ జనతా పార్టీ చీఫ్ జేపీ నడ్డా , కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు.
అతిరథ మహారథుల సమక్షంలో పుష్కర్ సింగ్ ధామీ ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. వీరితో పాటు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ,
మనహోర్ లాల్ ఖట్టర్ , ప్రమోద్ సావంత్ , మీనాక్షి లేఖి సహా ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు.
డెహ్రా డూ్ లోని పరేడ్ గ్రౌండ్ లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇదిలా ఉండగా
సీఎం పుష్కర్ సింగ్ ధామీతో(Pushkar Singh Dhami) పాటు ఎనిమిది మంది కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
వారిలో ఐదుగురు సత్ఫాల్ మహరాజ్ , సుబోధ్ ఉనియాల్ , ధన్ సింగ్ రావత్ , రేఖా ఆర్యా, గణేష్ జోషి వరుసగా రెండో సారి రాష్ట్ర కేబినెట్ లో కొలువు తీరారు. ఇక ముగ్గురికి కొత్తగా కేబినెట్ లో ఛాన్స్ ఇచ్చారు.
చందన్ రామ్ దాస్ , సౌరభ్ బహుగుణ, ప్రేమ్ చంద్ అగర్వాల్ కొలువు తీరారు. అంతకు ముందు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ,
విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి నేతృత్వంలో శాసనసభా పక్ష సమావేశం జరిగింది.
రాష్ట్రంలో మొత్తం 70 సీట్లకు గాను 47 స్థానాలలో బీజేపీ ఘన విజయాన్ని నమోదు చేసింది.
Also Read : బోయగూడ అగ్నిప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి