Bandi Sanjay : భారతీయ జనతా పార్టీ చీఫ్ బండి సంజయ్ కుమార్ పటేల్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మరోసారి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు.
ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ఏకపక్షంగా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్ , రఘునందన్ రావు, రాజా సింగ్ లను స్పీకర్ వేటు వేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
కేసీఆర్ సోయి తప్పి పాలన సాగిస్తున్నాడని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉంటుందన్నారు. తనకు భారత రాజ్యాంగం పట్ల నమ్మకం లేదని అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకంఉటున్నారంటూ మండిపడ్డారు.
ఇవాళ బండి సంజయ్ పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఈ చర్యను ప్రతి ఒక్కరు ఖండించాల్సిందేనని అన్నారు. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేయాలని అనుకుంటే ఇంత ఖర్చు, పోలీసు భద్రత, అధికారులు అవసరం లేదన్నారు.
ఇక నీ పాలనకు మూడిందని కావాలని అనుకుంటే అసెంబ్లీని ప్రగతి భవన్ లో పెట్టుకోమంటూ సూచించారు బండి సంజయ్ కుమార్(Bandi Sanjay). తమ ఎమ్మెల్యేలను చూసి కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు.
కేసీఆర్ కు ఇప్పటి వరకు తాము ట్రైలర్ మాత్రమే చూపించామని ఇక ముందు సినిమా చూపిస్తామని హెచ్చరించారు. ఆరి పోయే దీపానికి వెలుగు ఎక్కువని అందుకే ఇలాంటి లపూట్ పనులు చేస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు
. కేసీఆర్ సర్కార్ కు ఇదే చివరి బడ్జెట్ గా ఆయన అభివర్ణించారు. ప్రజాస్వామ్య విరుద్దంగా తమ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన సీఎం కేసీఆర్, ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read : అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ వాకౌట్