Putin : ఇజ్రాయెల్ కు పుతిన్ క్షమాపణ
ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం
Putin : యూదుల పట్ల రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్ రోవ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇజ్రాయల్ లో తీవ్ర దుమారం రేపాయి. ఆ దేశం తీవ్ర అభ్యంతరం తెలిపింది. దీంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్(Putin) స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది.
ఒక్కోసారి కొన్ని మాటలు ఆచి తూచి వాడాల్సి ఉంటుంది. దేశాల మధ్య సంబంధాలు బాగు పడాలంటే విదేశాంగ శాఖ మంత్రులు, రాయబారులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.
సరిగ్గా ఇదే జరిగింది. రష్యా హిట్లర్ వాదనలకు పుతిన్ క్షమాపణ చెప్పారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
యూదు ప్రజల పట్ల రష్యా తన వైఖరిని స్పష్టం చేసినందుకు ధన్య వాదాలు అని నఫ్లాలి బెన్నెట్ కార్యాలయం తెలిపింది. అడాల్ఫ్ హిట్లర్ కు యూదుల రక్తం ఉందంటూ మాస్కో అగ్ర దౌత్యవేత్త సెర్గీ లావ్ రోవ్ కామెంట్స్ చేశారు.
ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి ఇజ్రాయెల్ లో. తీవ్ర నిరసన, అభ్యంతరం వ్యక్తం చేసింది రష్యాపై ఇజ్రాయెల్. ఇదిలా ఉండగా లావ్ రోవ్ చేసిన వ్యాఖ్యల పట్ల తాను చింతిస్తున్నానని, మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని స్పష్టం చేశారు రష్యా ప్రెసిడెంట్ పుతిన్.
ఈ విషయంపై తాము రాద్దాంతం చేయదల్చు కోలేదని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెన్నెట్ చెప్పారు. ఇంకోసారి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడతామని పేర్కొన్నారని వెల్లడించారు.
నేను తప్పు కావచ్చు. కానీ హిట్లర్ కు యూదుల రక్తం కూడా ఉందని స్పష్టం చేయడం ఈ దుమారానికి దారి తీసింది. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ మంత్రి యైర్ లాపిడ్.
ఈ వ్యాఖ్యలను క్షమించరాని, దారుణమైన ప్రకటన. భయంకరమైన చారిత్రక తప్పిదమని మండిపడ్డారు.
Also Read : డెన్మార్క్ పీఎంతో ప్రధాని మోదీ భేటీ