Putin US : ఉక్రెయిన్ పై ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సైనిక చర్య పేరుతో పూర్తి స్థాయిలో యుద్దానికి దిగిన రష్యా చీఫ్ వ్లాదిమీర్ పుతిన్(Putin US )పై కన్నెర్ర చేసింది అమెరికా.
ఈ సందర్భంగా యుద్దం ఆపాలని అమెరికాతో పాటు పలు దేశాలు, ఐక్య రాజ్య సమితి కోరినా పట్టించు కోలేదు. ఇదే సమయంలో వాటికన్ క్యాథలిక్ పోప్ ఫ్రాన్సిస్ సైతం వార్ ఆపాలని కోరారు.
వీలైతే ప్రోటోకాల్ లేకుండానే తాను మాస్కోకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. కానీ పుతిన్ కర్కశత్వ మనస్తత్వం తలవంచ లేదు.
మరో వైపు అమెరికా పూర్తి స్థాయిలో యుద్దం ఆపేందుకు రష్యాతో చర్చలు జరపాలని భారత దేశాన్ని కోరింది. ఇండియా మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరించింది.
తాజాగా అమెరికా రష్యాపై నిప్పులు చెరిగింది. ఈ సందర్భంగా పుతి(Putin US )న్ ను యుద్ద నేరస్తుడంటూ యుఎస్ ఆరోపించింది. విచిత్రం ఏమిటంటే ఎగువ సభ (సెనేట్ )లో ఏకపక్షంగా తీర్మానం చేయడం విశేషం.
నిత్యంత భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యే సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనం రేపింది. ప్రస్తుతం ఈ అంశం చర్చకు దారితీసింది. ఇదిలా ఉండగా రిపబ్లికన్ సేనేటర్ లిండే గ్రహమ్ ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశ పెట్టారు.
రెండు పార్టీలకు చెందిన వారు ఏకపక్షంగా పుతిన్ ను యుద్ద నేరస్థుడిగా ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. గత కొంత కాలంగా నిరాటంకంగా రష్యా దాడులకు దిగుతూ వస్తోంది. దీనిని మేం తీవ్రంగా గర్హిస్తున్నట్లు పేర్కొంది అమెరికా.
Also Read : సాంకేతిక లోపం మిస్సైల్ ప్రయోగం