Japan Proposes : వచ్చే మే 24న క్వాడ్ లీడర్స్ సమ్మిట్ కోసం ప్రతిపాదించింది జపాన్. ఇతర సభ్య దేశాలు ఆస్ట్రేలియా, జపాన్ , యుఎస్ అంగీకారం తెలుపాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా అమెరికా చీఫ్ జోసెఫ్ బైడెన్ పర్యటిస్తారు.
ఇందులో భాగంగా భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ , జపాన్ ప్రధాన మత్రి పుమియో కిషిడాతో ద్వైపాక్షిక సమావేశాలు(Japan Proposes )నిర్వహిస్తారు.
జో బైడెన్ టోక్యోలో పర్యటించనున్నారు. తదుపరి క్వాడ్ లీడర్స్ సమ్మిట్ జరిపేందుకు మొగ్గు చూపింది జపాన్. కాగా ఆస్ట్రేలియా సార్వత్రిక ఎన్నికలు ముగిసిన కొద్ది రోజుల తర్వాత ఇది జరిగే చాన్స్ ఉంది.
అయితే మే 20 నుంచి 24 మధ్యలో జో బైడెన్ దక్షిణ కొరియా, జపాన్ దేశాలకు వెళతారని , టోక్యోలో జరిగే క్వాడ్ శిఖరాగ్ర సమావేశానికి కూడా హాజరు కానున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది.
ఈ పర్యటనలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇండియా, జపాన్, దక్షిణ కొరియా నేతలతో బైడెన్ సమావేశం కానున్నారు. జపాన్(Japan Proposes )అంతకు ముందు ఏప్రిల్ లో నిర్వహించాలని అనుకుంది.
కానీ వీలు కుదరలేదు క్వాడ్ సమావేశానికి. క్వాడ్ లో ఆస్ట్రేలియా కూడా భాగస్వామిగా ఉంది. మే 21న దేశంలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి.
ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ ఎన్నికల్లో గెలుపు ఓటములపై కూడా ఉత్కంఠ నెలకొంది. ఈనెల ప్రారంభంలో జరిగిన పోలింగ్ లో మోరిసన్ ప్రభుత్వం ఫెడరల్ ఎన్నికల్లో ఓడి పోవచ్చని తేలింది.
Also Read : పుతిన్ పై డొనాల్డ్ ట్రంప్ కన్నెర్ర