Queen Elizabeth II India : భార‌త్ తో ఎలిజబెత్ తో బంధం

1961, 1983, 1997లో దేశంలో ప్రిన్స్ టూర్

Queen Elizabeth II India :  బ్రిట‌న్ దేశానికి సుదీర్ఘ కాలం పాటు కొలువు తీరిన 96 ఏళ్ల ప్రిన్స్ ఎలిజ‌బెత్ -2 క‌న్నుమూశారు. ఆమె త‌న కాలంలో ఎన్నో దేశాల‌లో ప‌ర్య‌టించినా ఎక్కువ‌గా భార‌త్ ను సంద‌ర్శించారు.

ఈ దేశంతో ఆత్మీయ బంధాన్ని కొన‌సాగిస్తూ వ‌చ్చారు. మూడు సార్లు దేశంలో ప‌ర్య‌టించారు. ఇరు దేశాల మ‌ధ్య సంబంధ బాంధవ్యాల‌ను కొన‌సాగించేందుకు నిర్ణ‌యించారు.

ప్రిన్స్ ఎలిజబెత్ మొద‌టిసారిగా భార‌త్ ను 1961లో ప‌ర్య‌టించారు. అనంత‌రం 1983లో, 1997లో చివ‌రి సారిగా వ‌చ్చారు. 1983లో సంద‌ర్శించిన స‌మ‌యంలో ప్రిన్స్ ఎలిజ‌బెత్ కు ఆనాటి భార‌త రాష్ట్రప‌తి జ్ఞాని జైల్ సింగ్ , ప్ర‌ధాన మంత్రి ఇందిరా గాంధీ సాద‌ర స్వాగ‌తం ప‌లికారు.

ఇప్పుడు ఆ ఇద్ద‌రూ లేరు. ఇవాల్టితో ఎలిజ‌బెత్(Queen Elizabeth II India) కూడా ఈ లోకంతో త‌న బంధాన్ని తెంచుకున్నారు. తాను ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా భార‌త దేశంలో ల‌భించిన సాద‌ర స్వాగ‌తం, ఆతిథ్యానికి ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యారు.

ఆనాటి నుంచి నేటి దాకా భార‌త్ తో మ‌రింత బ‌లోపేత‌మైన సంబంధాలు కొన‌సాగించేందుకు ఉత్సుక‌త చూపారు ప్రిన్స్ ఎలిజ‌బెత్. ఈ సంద‌ర్భంగా ఆనాడు భార‌త్ గురించి ఆమె చేసిన కీల‌క వ్యాఖ్య‌లు ఎంతో ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.

భార‌తీయ ప్ర‌జ‌ల ఆప్యాయ‌త‌, ఆతిథ్యం , ఆ దేశం గొప్పత‌నం , వైవిధ్యం మ‌నంద‌రికీ ప్రేర‌ణ గా ఉన్నాయ‌ని ప్ర‌శంసించారు.

ఇక 1961లో బ్రిట‌న్ సార్వ‌భౌమాధికారిగా ప్రిన్స్ మొద‌టి సారి ప‌ర్య‌టించిన స‌మ‌యంలో త‌న భ‌ర్త దివంగ‌త ప్రిన్స్ ఫిలిప్ తో క‌లిసి ముంబై, చెన్నై, కోల్ క‌తాల‌లో ప‌ర్య‌టించారు.

ఆగ్రా లోని తాజ్ మ‌హ‌ల్ ను సంద‌ర్శించారు. రాజ్ ఘాట్ వ‌ద్ద గాంధీకి నివాళుల‌ర్పించారు.

Also Read : క్వీన్ ఎలిజ‌బెత్ భార‌త్ కు ట్రూ ఫ్రెండ్

Leave A Reply

Your Email Id will not be published!