Queen Elizabeth II : క్వీన్ ఎలిజబెత్ ఆరోగ్యం విషమం
వైద్యుల పర్యవేక్షణలో మేడం
Queen Elizabeth II : క్వీన్ ఎలిజబెత్ ఆరోగ్యం విషమంగా ఉంది. ఈ విషయాన్ని వైద్యులు ప్రకటించారు. క్వీన్ ఎలిజబెత్ వయస్సు 96 ఏళ్లు. గత ఏడాది 2021 అక్టోబర్ నుండి ఆమె అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు.
నడిచేందుకు , నిలబడేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఆమె ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉందని వెల్లడించారు. శరీరం వైద్యానికి సహకరిస్తోందని తెలిపారు.
కాగా బకింగ్ హోమ్ ప్యాలెస్ వైద్యులు ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతుండడంతో దేశ వ్యాప్తంగా కొంత ఆందోళన నెలకొంది. ఆమె వైద్య పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు స్పష్టం చేయడంతో క్వీన్ ఎలిజబెత్ -2(Queen Elizabeth II) పట్ల గురువారం భయాలు మరింత పెరిగాయి.
ఆమె తన సీనియర్ రాజకీయ సలహాదారులతో ప్రణాళికాబద్దమైన సమావేశం నుండి విరమించుకుంది. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
మునుపటి రోజు ఆమె యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్ ) మాజీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తో సమావేశమైంది. ఇదే క్రమంలో తదుపరి ప్రధాన మంత్రిగా విదేశాంగ శాఖ నిర్వహిస్తున్న లిజ్ ట్రస్ ప్రవాస భారతీయుడైన రిషి సునక్ పై విజయం సాధించింది ప్రధానిగా.
ఈ మేరకు మర్యాద పూర్వకంగా క్వీన్ ఎలిజబెత్ ను కలుసుకుంది ట్రస్. ఇదిలా ఉండగా ప్రజాస్వామ్య యుతంగా విజయం సాధించినా క్వీన్ ఆమోదం తప్పనిసరిగా ఉండాల్సిందే.
ఇదిలా ఉండగా యువరాజులు చార్లెస్ , విలియం లు ప్రస్తుతం బాల్మోరల్ కు ప్రయాణం అయ్యారని కెన్సింగ్టన్ ప్యాలెస్ తెలిపింది. ఈ సందర్భంగా లిజ్ ట్రస్ ట్వీట్ చేసింది.
బకింగ్ హామ్ ప్యాలస్ నుండి వచ్చే వార్తలతో దేశం మొత్తం తీవ్ర ఆందోళన చెందుతోందని పేర్కొంది.
Also Read : లోకాన్ని వీడిన క్వీన్ ఎలిజబెత్ – II