R Ashoka : కర్ణాటక సీఎంను మార్చే ప్రసక్తి లేదు
మంత్రి ఆర్. అశోక ప్రకటన
R Ashoka : కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మైని మారుస్తున్నట్లు వస్తున్న ప్రచారం అవాస్తవమని అన్నారు ఆ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ఆర్. అశోక. బొమ్మై సారథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు.
ఇప్పటికే ఇదే విషయాన్ని భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం చెప్పిందన్నారు. తమ అంతర్గత విభేదాలను కప్పి పుచ్చుకునేందుకే తమపై తప్పుడు ప్రచారం చేస్తోందంటూ ధ్వజమెత్తారు.
అనవసరంగా బొమ్మై పదవి గురించి కామెంట్ చేశారంటూ మండిపడ్డారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో కాంగ్రెస్ పార్టీ దమ్ముంటే ప్రకటించాలని సవాల్ విసిరారు.
బుధవారం ఆర్. అశోక మీడియాతో మాట్లాడారు. బొమ్మైకి ఢోకా లేదన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా తో సహా అగ్ర నాయకత్వం ఇప్పటికే భరోసా ఇచ్చారని చెప్పారు.
ఆయన సారథ్యంలోనే ఎన్నికలకు వెళతామని ప్రకటించారని గుర్తు చేశారు. ఒక్కసారి కమిట్ అయ్యాక వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదన్నారు. పార్టీ చెప్పిన దానికి కట్టుబడి ఉందన్నారు.
సీఎం బొమ్మైని మార్చడం గురించి ఆయనను తోలుబొమ్మ సీఎం అని కూడా పిలుస్తారంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన వరుస ట్వీట్లపై కూడా మంత్రి ఆర్. అశోక(R Ashoka) స్పందించారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఆధారం లేకుండా పోయిందన్నారు. కర్ణాటకలో దాని అడ్రస్ ఎక్కడుందో తెలియదంటూ ఎద్దేవా చేశారు.
బీజేపీ నాయకత్వం , సీఎం మార్పు గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు ఆర్. అశోక.
Also Read : గెలిపిస్తే గుజరాత్ కు గ్యారెంటీ స్కీం