Radha Kishan Rao : రాధా కిష‌న్ రావు రాజీనామా

తెలంగాణ‌లో మారుతున్న సీన్

Radha Kishan Rao : హైద‌రాబాద్ – రాష్ట్రంలో ఒక్క‌సారిగా రాజీనామాల‌ ప‌ర్వం మొద‌లైంది. నిన్న‌టి దాకా త‌మ‌కు ఎదురే లేద‌ని విర్ర వీగుతూ, ప్ర‌జ‌ల‌ను నానా ర‌కాలుగా ఇబ్బందుల‌కు గురి చేస్తూ వ‌చ్చిన ఉన్న‌తాధికారులు, చైర్మ‌న్లు, సీఎండీలు ఒక్కొక్క‌రుగా త‌మ ప‌ద‌వుల నుంచి త‌ప్పుకుంటున్నారు.

Radha Kishan Rao Resign Viral

తాజాగా తెలంగాణ జెన్ కో, ట్రాన్స్ కో సీఎండీగా ఉన్న ప్ర‌భాక‌ర్ రావు గుడ్ బై చెప్పారు. దొర మాజీ సీఎం కేసీఆర్(KCR) కు స‌న్నిహితులుగా పేరు పొందిన వారంతా రాజీనామాల బాట ప‌ట్టారు. రిటైర్డ్ డీసీపీ, హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ టాస్క్ ఫోర్స్ , ఓఎస్డీ గా ఉన్న రాధా కిష‌న్ రావు త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.

కేసీఆర్ ప్ర‌భుత్వంలో ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. అయినా త‌న ప‌ద‌వీ కాలం పొడిగించారు. తిరిగి ప్ర‌భుత్వ ఖ‌జానా ద్వారా భారీ ఎత్తున వేత‌నంతో పాటు అధికారాన్ని చెలాయించారు. దీంతో రేవంత్ రెడ్డి ఇప్పుడు కీల‌క‌మైన ప‌ద‌విలో ఉండ‌డంతో భ‌యంతో దెబ్బ‌కు ప‌ద‌వుల నుంచి త‌ప్పుకుంటున్నారు.

యావ‌త్ తెలంగాణ స‌మాజం వీరి రాజీనామాల‌ను చూసి విస్తు పోతున్నారు. వీరంతా ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురి చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లున్నాయి.

Also Read : G kishan Reddy : బ‌ల‌ప‌డ్డాం లోపాలు దిద్దుకుంటాం

Leave A Reply

Your Email Id will not be published!