Amrit Pal Singh : దాడి వెనుక అమృతపాల్ సింగ్

ఖ‌లిస్తాన్ సానుభూతిప‌రుడిగా గుర్తింపు

Amrit Pal Singh : రాడిక‌ల్ ఖ‌లిస్తాన్ సానుభూతిప‌రుడిగా పేరొందిన అమృత పాల్ సింగ్ పంజాబ్ లో చురుకైన పాత్ర పోషిస్తుండ‌డం క‌ల‌క‌లం రేపింది. బింద్ర‌న్ వాలే అనుచ‌రుడిగా చెప్పుకుంటూ వ‌చ్చాడు సింగ్. ఇటీవ‌లే దుబాయ్ నుంచి తిరిగి వ‌చ్చాడు. ఆ వెంట‌నే గ‌త కొన్ని వారాలుగా వివాదాస్ప‌ద ప్ర‌సంగాలు చేస్తూ రెచ్చ‌గొట్టే ప‌ని చేస్తున్నాడు. హ‌త‌మైన ఖ‌లిస్తాన్ వేర్పాటువాది ..ఉగ్ర‌వాది జ‌ర్నైల్ సింగ్ భింద్ర‌న్ వాలే స్వ‌స్థ‌ల‌మైన మెగా జిల్లాలోని రోడ్ లో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

గ‌తంలో తాను ఖ‌లిస్తాన్ వేర్పాటు వాదినంటూ ప్ర‌క‌టించాడు అమృత‌పాల్ సింగ్(Amrit Pal Singh) . సాయుధ మ‌ద్ద‌తుదారుల‌తో త‌ర‌చూ స‌మావేశం అవుతూ వ‌స్తున్నాడ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. రాడిక‌ల్ భావ‌జాలం క‌లిగిన వ్య‌క్తిగా గుర్తింపు పొందాడు. గురువారం 29 ఏళ్ల సింగ్ మ‌ద్ద‌తుదారులు కొంద‌రు క‌త్తులు, తుపాకులు చూపుతూ బారికేడ్ల‌ను ఛేదించారు. అమృత్ స‌ర్ న‌గ‌ర శివార్ల లోని అజ్నా లా లోని పోలీస్ స్టేష‌న్ పై దాడి చేశారు.

కిడ్నాప్ తో సంబంధం ఉన్న కేసులో నిందితుడైన ల‌వ్ ప్రీత్ సింగ్ అలియాస్ తూఫాన్ ను విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ మొత్తం దాడి వెనుక మాస్ట‌ర్ ప్లాన్ అమృత పాల్ సింగ్ అని భావిస్తున్నారు పోలీసులు. ఈ దాడిలో కొంత మంది పోలీసులు కూడా గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం. రూప్ న‌గ‌ర్ జిల్లా లోని చ‌మ్ కౌర్ సాహిబ్ కు చెందిన బ‌రీంద‌ర్ సింగ్ ను కిడ్నాప్ చేసి కొట్టినందుకు అమృత‌పాల్ తో స‌హా 30 మందిపై కేసు న‌మోదు చేశారు.

Also Read : ఈశాన్య ప్రాంతాన్ని ఏటీఎంగా వాడారు

Leave A Reply

Your Email Id will not be published!