Raghav Chadha : కాషాయం, మతవాద రాజకీయాలతో దేశాన్ని అతలాకుతలం చేస్తున్న భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర నాయకుడు, ఎంపీ రాఘవ్ చద్దా.
ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ జనం మధ్య చిచ్చు పెడుతున్న ఆ పార్టీ పట్ల అత్యంత జాగ్రత్తతో ఉండాలని హెచ్చరించారు. ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీసుకు వచ్చిన విద్యా విధానం దేశ వ్యాప్తంగా వ్యాపించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ దేశం విద్యావంతులైన, ప్రగతి శీలంగా మారాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా ఢిల్లీ సీఎం ఇంటి ముందు నిరసనలు తెలిపి, విధ్యంసానికి పాల్పడిన వారు బెయిల్ పై విడుదలైన యువ మోర్చా కార్యకర్తలను బీజేపీ ప్రశంసించింది.
అంతే కాదు వారికి పూలమాలలు వేసి సత్కరించింది. దీనిపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు రాఘవ్ చద్దా(Raghav Chadha). బీజేపీ వారిని యువ విప్లవకారులు అంటూ పేర్కొనడాన్ని రాఘవ్ చద్దా.తప్పు పట్టారు.
వారిని మోసగాళ్లు, పోకిరీలు, విధ్వంసకారులుగా అభివర్ణించారు రాఘవ్ చద్దా. వీరంతా లంపెన్ ఎలిమెంట్స్ అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ రోజు రాజకీయాలలో రెండు పాఠశాలలు ఉన్నాయి. కేజ్రీవాల్ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ కాగా మరొకటి బీజేపీ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అని వెల్లడించారు.
అమెరికా, బ్రిటన్ , ఇతర దేశాలలో ఎవరైనా నేరస్థులైతే జైలుకు వెళతారు. కానీ భారత దేశంలో బీజేపీలో చేరుతారంటూ ఆరోపించారు రాఘవ్ చద్దా.
Also Read : భగవంత్ మాన్ పై తజిందర్ పాల్ ఫిర్యాదు