Raghav Chadha : ప్రమాదంలో ప్రజాస్వామ్యం – రాఘవ్ చద్దా
మోదీ సర్కార్ ది బాధ్యతా రాహిత్యం
Raghav Chadha : ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా నిప్పులు చెరిగారు. బుధవారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు దీనిని గమనించాలని సూచించారు. ఓ వైపు మణిపూర్ తగలబడి పోతుంటే, హింసతో , నిత్యం అల్లర్లతో రగిలి పోతుంటే ఎందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నోరు మెదపడం లేదంటూ ప్రశ్నించారు. ఇదే విషయాన్ని ప్రతిపక్షాల కూటమి ఇండియా ప్రశ్నించిందని, నిలదీసిందని అయినా మోదీ పలకడం లేదంటూ ఎద్దేవా చేశారు.
Raghav Chadha Comments
మణిపూర్ గత మే 3 నుంచి మండుతోందని, ఇప్పటి దాకా 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు, 50 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. కానీ కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ ఎందుకు కంట్రోల్ చేయలేక పోతోందని నిప్పులు చెరిగారు ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha). ఇది ఎంత మాత్రం దేశానికి మంచి పద్దతి కాదన్నారు.
చివరకు మోదీ దేశాన్ని ఏం చేయాలని అనుకుంటున్నారంటూ మండిపడ్డారు. వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ , దేశంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న మోదీకి, ఆయన పరివారానికి రాబోయే రోజుల్లో ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదన్నారు రాఘవ్ చద్దా.
Also Read : Vangaveeti Asha Latha : ఆశాలత ఎంట్రీపై ఉత్కంఠ