Raghav Chadha : రాజ్ నాథ్ పై రాఘవ్ చద్దా గరం
మణిపూర్..ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ కథేంటి
Raghav Chadha : పంజాబ్ లో శాంతి భద్రతలు క్షీణించాయంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆప్ మండిపడింది. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం ఆ పార్టీకి చెందిన ఎంపీ , పంజాబ్ గౌరవ సలహాదారు రాఘవ్ చద్దా నిప్పులు చెరిగారు. గతంలో కంటే ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ అదుపులో ఉందన్నారు. రాజ్ నాథ్ సింగ్ చేసిన ఆరోపణలు అవాస్తవమని మండిపడ్డారు.
భారతీయ జనతా పార్టీ ఆధీనంలో ఉన్న మణిపూర్ కాలి పోతోందని, ఇక కేంద్ర సర్కార్ పరిధిలో ఉన్న ఢిల్లీ పోలీస్ వ్యవస్థ దారుణంగా ఉందని ధ్వజమెత్తారు. ఇప్పటికే మణిపూర్ లో జనం బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. తమ సంగతి చూసుకోకుండా ఎదుటి వారిపై నిందలు వేయడం, బురద చల్లడం మాను కోవాలని సూచించారు రాఘవ్ చద్దా(Raghav Chadha).
మణిపూర్ లో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని, 300 మందికి పైగా గాయపడ్డారని, 60 వేల మంది నిరాశ్రయులయ్యారని , 10 వేల మంది సైనికులు మోహరించినా కంట్రోల్ చేయలేక పోతోంది మీ సర్కార్ కాదా అని ప్రశ్నించారు రాఘవ్ చద్దా. గతంలో ఎక్కడా లేని రీతిలో ఢిల్లీలో మీ ఆధీనంలో ఉన్న పోలీస్ వ్యవస్థ నిద్ర పోతోందని మండిపడ్డారు. హత్యలు, అత్యాచారాలకు అడ్డాగా మారిందని ధ్వజమెత్తారు.
Also Read : Rahul Gandhi Viral : రాహుల్ గాంధీ వైరల్
